TRS : త్వరలో ఈటలను కలవనున్న తుమ్మల, కడియం.. ఈ ముగ్గురి ప్లాన్ ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : త్వరలో ఈటలను కలవనున్న తుమ్మల, కడియం.. ఈ ముగ్గురి ప్లాన్ ఏంటి..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 May 2021,11:40 am

TRS : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో అయితే అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య విభేదాలు.. హైకమాండ్ నేతలపై సీరియస్ అవడం, మంత్రి వర్గం నుంచి తప్పించడం, కొందరు నాయకులు అధిష్ఠానం కావాలని పట్టించుకోకపోవడం.. ఇవన్నీ.. ప్రతిపక్షాలు మంచి సాకుగా దొరుకుతున్నాయి. పార్టీలోనే ఇన్ని సమస్యలు ఉంటే.. వీళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? అంటూ ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం తాను ఏది అనుకుంటే అది చేస్తూ వెళ్లిపోతున్నారు. భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మారోమారు కూడా ఆలోచించకుండా.. నిర్ధాక్షిణ్యంగా.. సీనియర్ నేత, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

kadiyam srihari tummala nageswar rao etela rajender

kadiyam srihari tummala nageswar rao etela rajender

అయితే.. ఈటలను ఎలా మంత్రి వర్గం నుంచి తొలగించారో.. అలాగే.. మరో ఇద్దరు సీనియర్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరి.. వీళ్లిద్దరూ టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి హయాంలో మంత్రులుగా పనిచేశారు. రెండో సారి టీఆర్ఎస్ పార్టీ గెలిచాక.. వీళ్లకు మంత్రి పదవులు దక్కలేదు సరి కదా.. అసలు.. సీఎం కేసీఆర్ కానీ.. టీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్లను పట్టించుకోవడమే మానేశారు. అసలు.. వీళ్లు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

పార్టీ అధికార కార్యక్రమాల్లో కూడా వీళ్లు ప్రస్తుతం పాల్గొనడం లేదు. దీంతో వీళ్లిద్దరికి తోడు ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా కలిశారు. నిజానికి.. ఖమ్మం జిల్లాలో తుమ్మలకు మంచి పట్టు ఉంది. అలాగే.. వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరికి మంచి పట్టు ఉంది. కరీంనగర్ జిల్లాలో ఈటలకు మంచి పట్టు ఉంది. ముగ్గురూ సీనియర్ నేతలు, బాగా పేరున్న నేతలే కానీ.. వీళ్లను మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఇబ్బంది పెడుతూ.. పక్కన పెట్టేసింది.

TRS : ఈ ముగ్గురి ప్లాన్ ఏంటి..?

పేరుకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ.. ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో.. పార్టీ నుంచి బయటికి రావాలని తుమ్మల, కడియం భావిస్తున్నారట. అయితే సరైన సమయం కోసం వాళ్లు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈటల కూడా బయటికి రావడంతో.. ముందు ఈటలతో తుమ్మల, కడియం భేటీ అవ్వాలని యోచిస్తున్నారట. ఈటల రాజేందర్ ను కలిసి.. భవిష్యత్తు కార్యాచరణను రచించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. తుమ్మల బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ముగ్గురు కలిసి ఏదైనా ఒక పార్టీలోకి వెళ్తారా? లేక.. ఈటల పార్టీ పెడితే.. అందులోకి తుమ్మల, కడియం శ్రీహరి వెళతారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది