Etela Rajender : ప్రతి ఒక ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేదం ఎంపీ ఈటల రాజేందర్
ప్రధానాంశాలు:
ఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కొరేముల నుంచి నారపల్లి తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారు మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మాజీ జిల్లా అధ్యక్షుడు విక్రం రెడ్డి పాల్గొన్నారు.

Etela Rajender : ప్రతి ఒక ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేదం ఎంపీ ఈటల రాజేందర్
ఈ సందర్భంగా ఎంపి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా మన దేశ సైనికుల పరాక్రమంపై గర్వంతో ప్రతి ఒక్కరూ మన ఇండ్లపై జాతీయ పతాకాన్ని ఎగరేద్దాం మన దేశభక్తిని చాటి చెప్పే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు .
ఈ కార్యక్రమంలో మండల్ మున్సిపల్ అధ్యక్షులు రాజు గౌడ్ మహేష్ గిరి సురేష్ నాయక్ మహిపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు స్థానిక నాయకులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .