Kalvakuntla Kavitha : చిరంజీవికి పెద్ద ఫ్యాన్ .. ఆ తర్వాత అల్లు అర్జున్ కి — కల్వకుంట్ల కవిత తగ్గేదేలే … | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kalvakuntla Kavitha : చిరంజీవికి పెద్ద ఫ్యాన్ .. ఆ తర్వాత అల్లు అర్జున్ కి — కల్వకుంట్ల కవిత తగ్గేదేలే …

Kalvakuntla Kavitha  : తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కుమార్తె, ఎమ్మెల్సీ నేత అయిన కల్వకుంట్ల కవిత రాజకీయాలతో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. పొలిటికల్గా ఎంత బిజీగా ఉన్నా ఆమెకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ అవసరమే కదా. ఈ క్రమంలోనే కవిత చాలాసార్లు చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. అయితే మరోసారి కవిత చిరంజీవి గురించి ప్రస్తావించారు. తాజాగా కవిత ఆన్లైన్లో నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజకీయాలతో […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 October 2023,8:00 pm

Kalvakuntla Kavitha  : తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కుమార్తె, ఎమ్మెల్సీ నేత అయిన కల్వకుంట్ల కవిత రాజకీయాలతో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. పొలిటికల్గా ఎంత బిజీగా ఉన్నా ఆమెకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ అవసరమే కదా. ఈ క్రమంలోనే కవిత చాలాసార్లు చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. అయితే మరోసారి కవిత చిరంజీవి గురించి ప్రస్తావించారు. తాజాగా కవిత ఆన్లైన్లో నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజకీయాలతో పాటు సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగారు. చిరంజీవి అభిమానిగా ఆయన గురించి ఏమైనా చెప్పండి అని అడగగా దానికి బదులుగా కవిత డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పారు.

మరో నెటిజన్ కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం అని అడగగా చిరంజీవి ఆల్వేస్ నెక్స్ట్ అల్లు అర్జున్ తగ్గేదేలే అని సమాధానం ఇచ్చారు. కవిత ఇచ్చిన సమాధానాలు చూసి అటు చిరంజీవి ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి, బన్నీ ఫోటోలను పక్క పక్కన పెట్టి కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో కూడా చిరంజీవి గురించి కవిత ఓ ఛానల్ లో మాట్లాడారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని జర్నలిస్ట్ అడగగా చిరంజీవి అని చెప్పారు. ఇప్పటికీనా అని మళ్ళీ ప్రశ్నించగా 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి అభిమాని అయ్యాక ఎప్పటికీ అభిమానిగానే ఉంటాం అని కవిత బదులిచ్చారు. ఇప్పుడు ఆ వీడియోను చిరంజీవి ఫ్యాన్స్ మళ్లీ వైరల్ చేస్తున్నారు.

ఇక కవితను రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు అని అడగగా 100 సీట్లు పక్కా అని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో 100 సీట్లు కచ్చితంగా గెలుస్తాం అని అన్నారు. ఇక చంద్రబాబు అరెస్టుపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా ఈ వయసులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరం. ఆయన కుటుంబం పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. ఆ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. మీ తండ్రి కాకుండా మీకు ఇష్టమైన రాజకీయవేత్త ఎవరు అని అడగగా మమతా దీదీ అని కవితా సమాధానం ఇచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది