Kantara Chapter 1 | బాక్సాఫీస్‌ దుమ్ముదులిపిన ‘కాంతార: చాప్టర్ 1’ .. వీకెండ్‌లో రూ.320 కోట్ల గ్రాస్, తర్వాత లక్ష్యం రూ.500 కోట్లు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kantara Chapter 1 | బాక్సాఫీస్‌ దుమ్ముదులిపిన ‘కాంతార: చాప్టర్ 1’ .. వీకెండ్‌లో రూ.320 కోట్ల గ్రాస్, తర్వాత లక్ష్యం రూ.500 కోట్లు!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 October 2025,2:00 pm

Kantara Chapter 1 | రిషబ్ శెట్టి క్రియేటివ్ విజన్‌లో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ అంచనాలకు మించి విజయం సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద కాశీ చూపిస్తోంది. రిలీజ్‌కు ముందే వివాదాలు, నెగటివ్ ప్రచారంతో కొంత వెనుకబడిన ఈ సినిమా, థియేటర్ల వద్ద భారీ వసూళ్లతో అసాధారణ రన్‌ మొదలు పెట్టింది.

#image_title

మూడు రోజుల్లో రూ.320 కోట్ల గ్రాస్!

చాలా భాషల్లో విడుదలైన ఈ సినిమా, నాలుగు రోజుల వీకెండ్‌లోనే దాదాపు ₹320 కోట్లు గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. కర్ణాటకలో అయితే వసూళ్లు భీభత్సంగా ఉన్నాయి. బళ్లారి, హుబ్లీ, రాయచూర్‌ వంటి జిల్లాల్లో అభిమానులు గేట్లు దాటి థియేటర్లలోకి ప్రవేశించడం విశేషంగా మారింది.

చాప్టర్ 1 బుక్ మై షోలో గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముకొని శాండల్‌వుడ్‌ నుంచి వచ్చిన చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. డిస్ట్రిబ్యూషన్ యాప్‌ కాకుండానే ఈ స్థాయిలో టికెట్ అమ్మకాలు జరగడం విశేషం. ఫస్ట్ డే నుంచే చూపిన ట్రెండ్‌ను నాలుగు రోజుల పాటు నిలబెట్టిన కాంతార టీమ్‌ను ట్రేడ్ వర్గాలు ప్రశంసించేస్తున్నాయి. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’ ముందున్న పెద్ద లక్ష్యం ₹500 కోట్ల క్లబ్. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం వచ్చే వారాంతానికే ఈ మార్క్ దాటే అవకాశం ఉంది. అయితే ₹1000 కోట్లు సాధించాలంటే మరింత స్టడీ రన్ అవసరం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది