Rishab Shetty Prabhas : కాంతారా రిషబ్ తో ప్రభాస్ మూవీ.. హోంబలె బ్లాస్టింగ్ ప్లానింగ్..!
ప్రధానాంశాలు:
Rishab Shetty Prabhas : కాంతారా రిషబ్ తో ప్రభాస్ మూవీ.. హోంబలె బ్లాస్టింగ్ ప్లానింగ్..!
Rishab Shetty Prabha : కె.జి.ఎఫ్ నిర్మాతలుగా హోంబలె ప్రొడక్షన్స్ కు భారీ క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో వారు సలార్ 1 సినిమా చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఐతే సలార్ 2 సినిమాకు ఇంకాస్త టైం పట్టేలా ఉంది. ప్రశాంత్ నీల్, ఎన్ టీ ఆర్ కాంబో సినిమా ప్లానింగ్ లో ఉంది. ఇదిలాఉంటే ఈమధ్యనే హోంబలె ప్రొడక్షన్స్ వారు ప్రభాస్ తో వారు 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నట్టు వెల్లడించారు.
ప్రభాస్ హోంబలె మూవీస్ అంటూ ఒక అనౌన్స్ మెంట్ కూడా చేశారు. ఐతే అందులో ఒకటి సలార్ 2 కాగా మరో రెండు సినిమాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఐతే ప్రభాస్ హోంబలె ప్రొడక్షన్స్ చేయబోయే ఒక సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అందిస్తుంది. అదేంటి అంటే కాంతారా రచయిత దర్శకుడు రిషబ్ శెట్టి ఇచ్చే కథతో ప్రభాస్ తో సినిమా చేయబోతున్నారట. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ కి తగినట్టుగా ఈ సినిమా కథ ఉంటుందట.
Rishab Shetty Prabha కాంతారాతో నటుడిగా దర్శకుడిగా సత్తా చాటిన..
కాంతారాతో నటుడిగా దర్శకుడిగా సత్తా చాటిన రిషబ్ శెట్టి ప్రభాస్ కోసం కథ ఇవ్వడం అంటే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రభాస్ కటౌటు కి తగిన కథ రిషబ్ అందించాడు అంటే మాత్రం ఆ సినిమా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుంది. రిషబ్ కథ ఇస్తే ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కాంతారా మేకర్ తో ప్రభాస్ సినిమా అనగానే రెబల్ ఫ్యాన్స్ లో అంచనాలు డబుల్ అయ్యాయి.
కాంతారా ప్రీక్వెల్ గా కాంతారా 2 చేస్తున్న రిషబ్ మరోసారి ఆ సీక్వెల్ తో కూడా పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈమధ్యనే పుష్ప 1 తర్వాత వచ్చిన పుష్ప 2 సూపర్ హిట్ అయ్యింది. తప్పకుండా కాంతారా 2 ని అదే రేంజ్ లో ఉంచాలని చూస్తున్నారు. కాంతారా ప్రభాస్ కాంబో సెట్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ లు షేక్ ఆడటం ఖాయమని చెప్పొచ్చు.