Kantara Chapter 1 | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద‌ర‌గొడుతున్న కాంతార 2 .. తొలి రోజు ఎంత రాబ‌ట్టింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kantara Chapter 1 | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద‌ర‌గొడుతున్న కాంతార 2 .. తొలి రోజు ఎంత రాబ‌ట్టింది?

 Authored By sandeep | The Telugu News | Updated on :3 October 2025,3:00 pm

Kantara Chapter 1 | కాంతార’ మూవీకి ముందు ఏం జరిగిందనే స్టోరీతో ‘కాంతార’ ఛాప్టర్ 1 ను తెరకెక్క‌గా, ఈ చిత్రం ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించినా.. సినిమాలో మొదటి సీన్స్.. ఇంటర్వెల్ బ్యాంక్.. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ ఈ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో రిషబ్ శెట్టి తన నట విశ్వరూపం చూపించాడు. దేవుడు ఆవహించగానే అతను చేసే నటన ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

#image_title

మంచి క‌లెక్ష‌న్స్

‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాకు కన్నడతో పాటు తెలుగులో కూడా బుకింగ్స్ తెలుగు సినిమాలకు మించి ఊపందుకున్నాయి. నిన్న ఒక్కరోజే బుక్ మై షో దాదాపు 1.28 మిలియన్ పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. తెలుగులో ఈ సినిమా రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందీలో ఈ సినిమాకు దసరా హాలీడే అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. అక్కడ ఈ సినిమా ఫస్ట్ డే రూ. 20 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక తమిళం, కేరళలో కూడా మంచి జోరు చూపిస్తుంది.

ఓవర్సీస్ లో కూడా $1 మిలియన్ యూస్ డాలర్స్ కు చేరువలో ఉంది. ఇక బాక్సాఫీస్ లెక్కలు గమనిస్తే.. ఈ చిత్రం ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 కోట్ల గ్రాస్ నుంచి రూ. 90 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హిందీలో బాగా కనెక్ట్ అయితే.. వెయ్యి కోట్ల క్లబ్ లో ప్రవేశించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక కాంతార ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఛావా’ ను క్రాస్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది