Karthika Deepam 23 Aug Monday Episode : కార్తీక దీపం 23 ఆగస్టు 2021, సోమవారం ఎపిసోడ్ 1125 తాజాగా రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయమే.. దీప అలారం పెట్టుకొని లేస్తుంది. పిన్నీనే కాదు.. నాన్న కూడా నమ్మకంగా చెప్పారు కాబట్టి.. నిజమే అయి ఉంటుంది అని అనుకుంటుంది. ఇంతలోనే వారణాసి ఫోన్ చేస్తాడు. అక్కా లేచావా? అని అడుగుతాడు. నేను ఒక పావుగంటలో రెడీ అయి వస్తా.. అని చెబుతుంది దీప.
కట్ చేస్తే.. మోనిత.. మళ్లీ సోది దానిలా రెడీ అవుతుంది. దీపను ఎలా చంపితే బాగుంటుంది.. అని అనుకుంటుంది. ఎలా చంపితే నా మీదికి రాదు.. అని ఆలోచిస్తుంది. ఈసారి.. అంజి లాంటి చెత్త వెదవను కాకుండా.. మంచి రౌడీని పెట్టి చంపించాలి.. అని అనుకుంటుంది. అలా అయితేనే.. నా చేతికి మట్టి అంటదు అని అనుకుంటుంది. అ అనుకుంటూనే.. ముఖానికి పసుపు పూసుకుంటుంది. సోది దానిలా రెడీ అవుతుంది. మళ్లీ అదే బుట్టను తీసుకొని.. అందులో గన్ చూసి.. నా పిచ్చి కానీ.. దీపను ఎలా చంపడం ఏంటి. ఈ గన్ ఉంది కదా.. ఇది చాలు.. దీంతో చంపేస్తా.. అంటూ బుట్ట పట్టుకొని బయలు దేరుతుంది.
కట్ చేస్తే.. దీప.. కారులో వెళ్తుంది. ఎక్కడికి అక్క ఇంత పొద్దుగాల అని వారణాసి అడిగే సరికి.. పూజ ఉంది.. అని చెబుతుంది. పిల్లలు లేకుండా పూజ ఏంటి.. అని అడుగుతాడు వారణాసి. ఏమో.. నాన్న చెప్పాడు. అది నేను ఒక్కదాన్నే వెళ్లి చేయాలట.. అని చెబుతుంది. ఏది ఏమైనా.. డాక్టర్ బాబుకు బెయిల్ దొరకాలంటే.. మోనితే బతికి రావాలి. అలా అయితేనే మోనితకు బెయిల్ దొరికేటట్టు ఉంది అని అంటాడు వారణాసి.
కారులో మోనిత కూడా బయలు దేరుతుంది. దేవుడా.. ఇవాళ ఎలాగైనా.. దీపను నాకు కనపడేలా చేయి. దానికి ఈరోజే ఆఖరు రోజు అని కారులో కూర్చొని ఆలోచిస్తుంటుంది మోనిత.
కట్ చేస్తే.. అంజి, దుర్గ.. ఇద్దరూ ఉదయం పూట రన్నింగ్ చేస్తుంటారు. అంజి అంటాడు.. నా వల్ల కాదు. నేను ఈ రన్నింగ్ చేయలేను.. అంటాడు. డాక్టర్ బాబును విడిపించడం కోసం మనం ఏదైనా చేయాలి. మోనిత కనిపిస్తే మాత్రం తొందరపడి చంపకు… అని అడుగుతాడు దుర్గ. ఎందుకు.. అని అంటే.. నేను తనను లవ్ చేస్తున్నా.. అని అంటాడు. వామ్మో.. దాన్ని లవ్ చేసేవాడు కూడా ఉంటాడా? అని అంటాడు అంజి. మోనిత కనిపిస్తే.. తీసుకెళ్లి రోషిణి మేడమ్ దగ్గరికి తీసుకెళ్లి డాక్టర్ బాబును విడుదల చేయాలి.. అని వాళ్లు అనుకుంటుండగానే.. దీప అక్కడికి వస్తుంది.
దీపమ్మ.. ఏంటి ఇలా వచ్చావు.. అని అడుగుతారు. దుర్గ.. నువ్వు నాకోసం ఎంతో చేశావు. ఈసారి ఇదొక్కటి చేయ్ అని అంటారు. ఇంత ఉదయమే ఎటు వెళ్తున్నావు దీపమ్మ అని అడుగుతాడు అంజి. ఏదో పూజ ఉందట.. అని అంటుంది. మేము కూడా వస్తావు.. అని అంటే.. వద్దు.. నేను ఒక్కదాన్నే వెళ్లాలట.. అని చెప్పి దీప వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. శౌర్య నిద్రలేచి కిందికి వస్తుంది. నానమ్మ.. అమ్మేది.. అని అడుగుతుంది. బెడ్ మీద లేదు.. అని చెబుతుంది. నాకు తెలియదు.. అని అంటుంది. క్యాంటిన్ కు ఏమైనా వెళ్లి ఉంటుందా? అని అంటుంది. క్యాంటీన్ అంటే పోలీస్ స్టేషన్ అని చెబుతుంది శౌర్య. క్యాంటీన్ ఏంటి.. అని అంటుంది.. నాన్నకు ఇడ్లీ పెడుతుంటే.. ఇది క్యాంటీనా? లేక పోలీస్ స్టేషనా? అని అంది ఆ రోషిణి మేడమ్.. అని అంటుంది. ఇంత ఉదయమే దీప ఎక్కడికి వెళ్లింది.. అని సౌందర్య ఆలోచిస్తుంది.
కట్ చేస్తే.. గుడిలో పూజారి.. అఖండ పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తుంటారు. ఇంతలోనే దీప కారు దిగుతుంది. తన వెనుకనే మోనిత కూడా కారు దిగుతుంది. గుడిలో తననే ఫాలో అవుతుంటుంది.
కానీ.. దీప మాత్రం మోనితను గమనించదు. తన కారు చూసి.. ఇది కార్తీక్, నేను తిరిగిన కారు.. వంటలక్క తిరుగుతోంది. ఇదే నీ ఆఖరి ప్రయాణం వంటలక్క అని అనుకొని.. గుడిలో తనను ఫాలో అవుతుంది.
పూజారి దగ్గరికి వచ్చి.. నమస్కారం చెబుతుంది. రా అమ్మ కూర్చో అంటాడు పూజారి. అంతా తెలిసిందమ్మా.. నీ కష్టాలు గట్టెక్కాయి అనుకుంటే.. పరీక్షలు ఎదురవుతున్నాయి. ఈ పరీక్షలకు ఎదుర్కొని నిలబడాలంటే.. నీకు ఆత్మస్థైర్యమే కాదు.. దైవబలం కూడా తోడవ్వాలి. అందుకే గణపతి హోమం జరిపించి.. నీతో అఖండ దీపం వెలిగిస్తే.. నీకు దైవ శక్తి కూడా తోడు అవుతుంది. అందుకే రమ్మన్నా.. అంటాడు పూజారి.
పూజారి గారు నేనుప్రస్తుతం చీకట్లో ఉన్నాను. మీరు అఖండ దీపం వెలిగించమన్నారు. ఆ వెలుగులో నా భర్తను కాపాడుకునే దారి కనపడుతుందని ఆశించి వచ్చాను.. అని దీప పూజారితో అంటుంది. అవునవును.. సరాసరి నరకానికి నీకు దారి కనపడుతుంది. అందుకే నేను వచ్చింది.. అని మోనిత మనసులో అనుకొని బుట్టలో ఉన్న గన్ తీసి చేతుల్లో పట్టుకుంటుంది.
ఈ సమస్యకు నాకు పరిష్కారం దొరికితే చాలు.. అని అనుకుంటుంది దీప. ఈ సమస్యకు పరిష్కారం.. ఈ లోకం నుంచే నీ బహిష్కారం.. అంటుంది మోనిత. నా భర్త వ్యక్తిత్వం నాకు తెలుసు. ఆయన ఒక నిండు ప్రాణం తీసే మనిషి కాదు. డాక్టర్ బాబు విషయంలో ఏదైతే నేను ముందునుంచీ అనుకుంటున్నానో.. అదే జరుగుతోంది. ఆయన ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలి.. అని అంటుంది దీప.
మోనిత.. గన్ ను దీపకు గురి పెడుతుంది. ఈ హోమాలు నీ ప్రాణాన్నే కాపాడగలగలేవు దీప. నన్ను, కార్తీక్ ను విడదీయలేవు.. అని అనుకుంటుంది మోనిత.
నిన్న.. నాన్న, పిన్ని వచ్చినప్పుడు ఒక సోదమ్మ కలిసిందట. తను ఒక పరిష్కారం చెబుతానన్నదట. తనను కూడా ఒకసారి కలుస్తా.. అని చెబుతుంది దీప. నువ్వు నన్ను కలవకముందే.. నిన్ను నేను గాలిలో కలిపేస్తాను.. అని అనుకుంటుంది మోనిత.
నువ్వు నీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి.. ప్రయాణం చేస్తున్నావు. నీ సమస్య పరిష్కారం కోసం ఇదో దారి. అది ఇంకో దారి అవుతుందని అనుకుంటే.. తనను తప్పకుండా కలవొచ్చు.. అని చెబుతాడు పూజారి.
దీపకు.. గన్ గురి పెడుతుంది కానీ.. మధ్యలో పూజారి అడ్డం వస్తుంటాడు. నువ్వు అఖండ దీపం వెలిగించు.. నేను హోమం ప్రారంభిస్తాను.. అని చెబుతాడు పూజారి. సరే.. అంటుంది దీప. అఖండ దీపం వెలిగించేందుకు దేవుడి దగ్గరికి వెళ్తుంది దీప. అఖండ దీపం వెలిగిస్తుండగానే.. దీపకు మోనిత గన్ గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కాల్చడానికి ప్రయత్నించగానే.. మళ్లీ పూజారి అడ్డం వస్తాడు. మధ్యలో భక్తులు కూడా అడ్డం వస్తారు. తను దండం పెట్టుకుంటుండగానే.. మోనిత.. దీపను గన్ తో కాలుస్తుంది. దీంతో దీప.. కింద పడబోతుండగానే.. పూజారి చూసి అమ్మా.. అంటాడు. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. మంగళవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.