Karthika Deepam 23 Aug Monday Episode Highlights : దీపను చంపేందుకు మోనిత వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? గుడిలోనే దీపను గన్ తో షూట్ చేసి చంపేస్తుందా?

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
Karthika Deepam 23 Aug Monday Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. అయితే.. సోమవారం 23 ఆగస్టు 2021, ఎపిసోడ్ 1124 హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. భాగ్య, తన భర్త చెప్పినట్టుగానే దీప.. ఉదయం లేవగానే గుడికి వెళ్తుంది. అక్కడ అఖండ దీపం వెలిగించడానికి వెళ్తుంది. అయితే.. అప్పటికే పూజారి అక్కడ అఖండ దీపం వెలిగించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. దీప ఎప్పుడైతే గుడికి వెళ్తుందో.. వెంటనే మోనిత కూడా సోది చెప్పేదాని వేషం వేసుకొని గన్ తో గుడికి వస్తుంది.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
దీపను ఫాలో అవుతుంది. ముసుగు వేసుకొని ఎవ్వరూ గుర్తు పట్టకుండా.. మోనిత.. దీపను ఫాలో అవుతుంది. ఇంతలో పూజారి దగ్గరికి వెళ్తుంది దీప. అఖండ దీపం దగ్గర కూర్చుంటుంది. నీ చేత అఖండ దీపం వెలిగిస్తే.. ఆ దైవ శక్తి కూడా నీకు తోడుంటుంది అమ్మా.. అంటూ పూజారి.. దీపతో అంటాడు. నీ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుందమ్మా.. అంటాడు.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
Karthika Deepam 23 Aug Monday Episode Highlights : ఈ పూజ వల్ల.. నా సమస్యకు పరిష్కారం దొరికితే చాలు అన్న దీప
ఈ పూజ వల్ల నా సమస్యకు ఒక పరిష్కారం దొరికితే అంతే చాలు. అందుకే.. భాగ్య పిన్ని చెప్పగానే నేను ఈ పూజ చేయడానికి వచ్చాను పూజారి గారు. నాది చాలా పెద్ద సమస్య. ఆ సమస్యకు ఎలాగైనా పరిష్కారం దొరికేలా చూడండి. ప్లీజ్.. అంటూ పూజారిని వేడుకుంటుంది దీప.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
అవునమ్మా.. నీ సమస్య గురించి భాగ్య చెప్పింది. నీ సమస్యకు ఆ దైవ శక్తి తప్పకుండా తోడు అవుతుంది. నువ్వేం భయపడకు అమ్మా. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. మంచి వాళ్లకు అంతా మంచే జరుగుతుంది.. అని పూజారి.. దీపకు ధైర్యం చెబుతాడు.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
Karthika Deepam 23 Aug Monday Episode Highlights : అఖండ దీపం పూజలో పాల్గొన్న దీప
ఇక.. అఖండ దీపం వెలిగించడం కోసం దీప పూజలో పాల్గొంటుంది. పూజారి పూజను ప్రారంభిస్తారు. దీప కూడా నిష్టగా పూజలో పాల్గొంటుంది. అయితే.. దీపను మోనిత ఫాలో అయ్యే విషయాన్ని.. దీప గమనించదు. తను పూజ చేస్తుండగా.. మోనిత.. అక్కడే కొంచెం దూరంలో.. చెట్ట కొమ్మలను అడ్డంగా పెట్టుకొని.. అక్కడ నిలబడి.. దీపకు గన్ గురి పెడుతుంది.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
Karthika Deepam 23 Aug Monday Episode Highlights : నువ్వు పైకి వెళ్తేనే.. నేను బయటికి వచ్చేది దీప అని అనుకున్న మోనిత
నీకున్న సమస్యకు పరిష్కారం.. ఈ లోకం నుంచే బహిష్కారం.. అంటూ మోనిత తనలో తానే అనుకుంటుంది. నిన్ను చంపడమే ఈ సమస్యకు పరిష్కారం. నిన్ను చంపితేనే నేను, కార్తీక్ సంతోషంగా ఉంటాం. లేదంటే నువ్వు మమ్మల్ని కలవనివ్వవు. అందుకే.. నీకు ఈ రోజు చావు ముహూర్తం పెట్టా.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
నీ చావు ఏనాటికైనా నా చేతుల్లోనే రాసి ఉంది. అది తథ్యం. అది కూడా ఈరోజే. ఇప్పుడే. ఇక.. నీ చాప్టర్ క్లోజ్ దీప. ఇక.. కార్తీక్ నా వాడు. నా కార్తీక్ తో నేను చాలా సంతోషంగా ఉంటాను. నీ పీడ విరగడ అవుతుంది.. ఈ లోకంలో కార్తీక్ ను జైలుకు వెళ్లకుండా ఆపగలిగే ఒకే ఒక ప్రాణి మోనిత. నువ్వు పైకి వెళ్తేనే.. నేను బయటికి వచ్చేది.. అప్పుడే నాకు మోక్షం కలిగేది.. అని మోనిత తనలో తానే అనుకుంటుంది.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
Karthika Deepam 23 Aug Monday Episode Highlights : దీపను గన్ తో షూట్ చేసిన మోనిత
కట్ చేస్తే.. దీప.. పూజలో భాగంగా.. పైకి లేస్తుంది. యాగం చేస్తుండగా.. దాని చుట్టూ ప్రదిక్షణలు చేస్తుంటుంది. ఇదే కరెక్ట్ సమయం. తను ప్రదిక్షణలు చేస్తున్నప్పుడే దీపను చంపేయాలని మోనిత అనుకొని గన్ ను గురి పెడుతుంది.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights
తను ప్రదిక్షణలు చేస్తుండగానే… గన్ తో కాల్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది. దీప చనిపోతుందా? గన్ బుల్లెట్.. దీపకు తగులుతుందా? అసలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights

Karthika Deepam 23 Aug 2021 monday episode 1124 highlights