KCR : ఆ విషయంలో రాహుల్ కు కేసీఆర్ మద్దతు.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా బీజేపీకి దూరం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో తనకు జ్వరం వచ్చినట్లుగా చెబుతున్నా కూడా కేసీఆర్ బీజేపీ పై కోపంతోనే ఆ పర్యటన కి దూరంగా ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ మరియు ప్రధాని రాష్ట్రానికి ఏం చేశారని ప్రధాని మోడీ కి స్వాగతాలు పలకాలి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.
తాజాగా కాంగ్రెస్ అధినేత అయిన రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్ దాడులు చేసింది అని అనడానికి ఆధారాలు చూపాలని అంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన నేపథ్యం లో అస్సాం సీఎం మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. సోనియా గాంధీ పై మరియు రాహుల్ గాంధీ పై అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించాడు. నీవు రాజీవ్ గాంధీ కొడుకువి అనటానికి ఆధారాలేంటి అంటూ ఆయన ప్రశ్నించడం తో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీని అంతలా విమర్శిస్తారా.. బీజేపీ వాళ్లకు మానవత్వం ఉందా అంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలిచాడు.
దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం కి సంబంధించిన వ్యక్తి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే సమయం లో కాంగ్రెస్ కు ఈ విషయం లో తమ మద్దతు ఉంటుంది అని టిఆర్ఎస్ వర్గాల వారు ప్రకటించారు. ఈ నేపథ్యం లో 2023 సంవత్సరంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియూ టిఆర్ఎస్ లు కలిసిపోతాయా అనే చర్చ మొదలు అయింది. బీజేపీకి బలం బాగా పెరిగింది ఈ సమయం లో కాంగ్రెస్ తో జోడి కడితే తప్పితే బీజేపీని ఎదుర్కోవడం కష్టం అంటూ కెసిఆర్ భావిస్తున్నాడు ఏమో అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఏ సమయం లో ఎలా వ్యవహరిస్తాడు అనేది ఎవరికీ తెలియదు. కనుక వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎలాంటి రాజకీయ వ్యూహాలను కేసీఆర్ అనుసరిస్తాడు అనేది చూడాలి.