Pension : పంద్రాగ‌స్ట్ కానుక‌.. నేడు ప‌ది ల‌క్ష‌ల మందికి ఫించ‌ను పంపిణి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pension : పంద్రాగ‌స్ట్ కానుక‌.. నేడు ప‌ది ల‌క్ష‌ల మందికి ఫించ‌ను పంపిణి..!

Pension : తెలంగాణ కేబినేట్ రానున్న ఎల‌క్ష‌న్స్‌లో గ‌ట్టి పోటి ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటుంది. సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు ఐటీ సెక్టార్‌పైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవ‌ల కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం సుదీర్ఘంగా 5 గంటల పాటు జరగగా, ఇందులో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ క్ర‌మంలో నేటి నుండి కొత్తగా 10 లక్షల పెన్షన్లు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :15 August 2022,12:20 pm

Pension : తెలంగాణ కేబినేట్ రానున్న ఎల‌క్ష‌న్స్‌లో గ‌ట్టి పోటి ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటుంది. సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు ఐటీ సెక్టార్‌పైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవ‌ల కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం సుదీర్ఘంగా 5 గంటల పాటు జరగగా, ఇందులో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ క్ర‌మంలో నేటి నుండి కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లతోపాటు మరో 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా కొత్తవి.. పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ కానున్నాయి.

Pension : గొప్ప కానుక‌..

పంద్రాగస్టుతో మొదలై ఈ నెలాఖరు వరకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా బార్‌కోడ్ విధానంతో నూనత పింఛన్లను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. డయాలసిస్ రోగులకు కూడా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డయాలసిస్ పేషంట్స్‌కి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో పాటు ఆసరా కార్డు కూడా ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదే అని కేసీఆర్ ప్రకటించారు.

KCR Giving Pension To 10 Lakh People On 15 Aug

KCR Giving Pension To 10 Lakh People On 15 Aug

ఇప్పటికే ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల కోసం ఆయా జిల్లాలకు కొత్త కార్డులు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఆసరా పింఛన్ల అర్హత వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించింది. దివ్యాంగులకు నెలకు రూ.3.016, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2.016 చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో 75 మంది ఖైదీల విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఈనెల 21న నిర్వహించాలని అనుకున్న శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేసింది. అదే రోజున భారీగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేసింది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది