Kavitha – KCR – KTR : బిగ్ బ్రేకింగ్.. ప్రగతి భవన్ లో సంచలనం..!
Kavitha – KCR – KTR : ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను సుమారు 9 గంటల పాటు ప్రశ్నించి మళ్లీ విచారణకు రావాలంటూ కవితను పంపించారు. వెంటనే రాత్రికి రాత్రే మంత్రి కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి స్పెషల్ విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు కవిత. హైదరాబాద్ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కవితతో పాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఆమె వెంట ప్రగతి భవన్ కు వెళ్లారు. ఇవాళ మొత్తం ప్రగతి భవన్ లోనే ఉండి.. తదుపరి విచారణ గురించి కవిత.. న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
గతంలో ఈడీ విచారణలో కవిత పాల్గొనప్పుడు కూడా ప్రగతి భవన్ లో ముందు న్యాయ నిపుణులతో చర్చించి కవిత ఆ తర్వాత ఈడీ అధికారులను కలిశారు. తాజాగా మరోసారి అదే పని చేశారు. ప్రగతి భవన్ లో ఇవాళ మొత్తం ఈడీ విచారణపై చర్చిస్తున్నారు. ప్రగతి భవన్ లో వీళ్లతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారట. ఆయన ఎవరో కాదు.. రెవెన్యూ శాఖలో కీలక అధికారి. ఇదివరకు ఈడీ విచారణలో కూడా ఆయన సలహాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Kavitha – KCR – KTR : రెవెన్యూ శాఖలో కీలక అధికారిగా ఉన్న వ్యక్తితో చర్చలు
తాజాగా మరోసారి ఆయన సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మార్చి 16న మరోసారి విచారణ ఉండటం వల్ల.. అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో ఆయన దగ్గర్నుంచి తెలుసుకుంటున్నట్టు సమాచారం. ప్రగతి భవన్ లో కేవలం కవిత, కేటీఆర్, హరీశ్ రావు.. ఈ ముగ్గురే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరినీ ప్రగతి భవన్ దరిదాపుల్లోకి కూడా రాలేదట. కవితతో ఢిల్లీకి మహిళా మంత్రులు, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. కానీ.. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవ్వరూ కవిత వద్ద లేరు. కేవలం హరీశ్ రావు, కేటీఆర్, కవిత మాత్రమే వెళ్లారు. చూద్దాం మరి ప్రగతి భవన్ లో కవిత ఎలాంటి వ్యూహాలు రచిస్తారో?