KCR : దళిత బంధుకు తాత లాంటి మరో ప్లాన్ తో కేసీఆర్ రెడీ.. ఈటల ఇక నోరు తెరిచే చాన్స్ లేకుండా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : దళిత బంధుకు తాత లాంటి మరో ప్లాన్ తో కేసీఆర్ రెడీ.. ఈటల ఇక నోరు తెరిచే చాన్స్ లేకుండా?

 Authored By sukanya | The Telugu News | Updated on :13 August 2021,9:34 pm

KCR హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఎన్నికలకు ముందే తెలంగాణలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని ప్రచారం జరుగుతోంది. దళిత బంధు పథకం కేంద్రంగా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ KCR యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో మొన్నటి వరకు సీఎం కేసీఆర్ KCR సహా మొత్తం 17మంది మంత్రులు ఉన్నారు.

భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 16 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌ మాత్రమే ఉన్నారు. ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చారని.. ఏడేళ్లుగా దళితులను మోసం చేస్తున్నారని, కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యత లేదని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజికవర్గం ప్రాతినిధ్యం పెంచాలని సీఎం కేసీఆర్ KCR యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా దళితులకు పట్టం కట్టలేదన్న అపవాదును తొలగించుకోవాలన్నది కేసీఆర్ KCR యోచనగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే ముందుగానే కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

CM KCR

CM KCR

మరో ఒకరిద్దరికి ఛాన్స్.. KCR

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 18 మంది టీఆర్‌ఎస్‌ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో 8 మంది మాల, 9 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని సామాజికవర్గానికి చెందినవారు. త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో వీరిలో నుంచి కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని సమాచారం. ముఖ్యంగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వీరిలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి రావొచ్చని సమాచారం. అంతేకాక ‘దళితబంధు’ పథకానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్‌ చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

CM KCR

CM KCR

మోత్కుపల్లి నర్సింహులు ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో ఇంకా చేరనేలేదు. ఇది వ్యూహాత్మకంగానే వాయిదా పడిందని.. దళిత బంధు పథకం బాధ్యతలను ఆయనకు అప్పజెప్పుతారని సమాచారం. ఇటీవలి కాలంలో తీన్మార్ మల్లన్న, వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్, ఈటల రాజేందర్ వంటి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నిర్ణయాలతో వారిందరికీ చెక్ పెట్టాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది