KCR : రెడ్డిలకు పదవులు.. కేసీఆర్ నయా మాస్టర్ ప్లాన్..!? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

KCR : రెడ్డిలకు పదవులు.. కేసీఆర్ నయా మాస్టర్ ప్లాన్..!?

KCR : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో కేసీఆర్ మార్క్ సోషల్ ఇంజినీరింగ్ స్పష్టంగా కనబడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి ఊహాలకు అందని విధంగా కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారని అంటున్నారు.మంగళవారం టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వెంనటే నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం. టీఆర్ఎస్‌పై రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరుగుతున్నదని రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 November 2021,2:40 pm

KCR : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో కేసీఆర్ మార్క్ సోషల్ ఇంజినీరింగ్ స్పష్టంగా కనబడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి ఊహాలకు అందని విధంగా కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారని అంటున్నారు.మంగళవారం టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వెంనటే నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం.

టీఆర్ఎస్‌పై రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరుగుతున్నదని రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో మూడు స్థానాలకు రెడ్డిలను ఎంపిక చేసి ఆ సామాజిక వర్గ మద్దతును కేసీఆర్ కూడగట్టే ప్రయత్నం చేసినట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్సీ కోటాలో నామినేట్ అయిన అభ్యర్థుల్లో మాజీ ఐఏఎస్ ఉన్నాడు.

సిద్దిపేట కలెక్టర్‌గా సేవలందించిన పి.వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొద్ది క్షణాల్లోనే ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. మొత్తంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. మిగిలిన ముగ్గురిలో బండ ప్రకాష్ ముదిరాజ్.. కాగా, కడియం శ్రీహరి..ఎస్సీ, తక్కళ్లపల్లి రవీందర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.

kcr reddy community given priority for mlc

kcr reddy community given priority for mlc

KCR : ఆ సామాజిక వర్గ మద్దతు కోసమే..

టీఆర్ఎస్‌కు ఉన్నటువంటి 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలంలో వీరు ఆరుగురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వరంగల్‌కు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా మూడేళ్ల టైం ఉంది. అయినప్పటికీ ఆయన్ను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేస్తున్నారు. త్వరలో ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలు వరుసగా రెండో సారి శాసన మండలికి ఎన్నికవుతున్నారు.

హుజురాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు కేసీఆర్. కానీ, ఆ నామినేషన్‌ను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పక్కన పెట్టేశారు. దాంతో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది