Hyderabad Metro : మరో గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. హైదరాబాద్ చుట్టూ మెట్రో రైల్…!
Hyderabad Metro : ఈ రోజు ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో కి మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద భూమి పూజ చేయడం జరిగింది. రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు ₹6250 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 31km మేరా మెట్రో నిర్మాణం జరగనుంది. ఈ మెట్రో నిర్మాణం 27.5 కిలోమీటర్లు ఆకాశమార్గంలో… విమానాశ్రయం వద్ద భూగర్భంలో మిగతా మార్గం ఉండనుంది.
మూడేళ్లలో మెట్రో నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ చుట్టు మెట్రో రైల్ రావాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్లు కేసీఆర్ మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏ రీతిలో ఉందో.. అదేవిధంగా నగరం చుట్టూ మెట్రో రైల్ రావలసిన అవసరం ఉందని కేసీఆర్ తెలియజేశారు.
ప్రపంచంలో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం అని పేర్కొన్నారు. నిజమైన విశ్వనగరం హైదరాబాద్ అని కొనియాడారు. 1912లో హైదరాబాద్ కి కరెంటు సదుపాయం ఉంది. అన్ని వర్గాలను భాగ్యనగరం అక్కున చేర్చుకుంది. అటువంటి హైదరాబాద్ నీ పవర్ ఐలాండ్ గా మార్చం. ప్రపంచంలో పేరుగాంచిన న్యూయార్క్, లండన్, ప్యారిస్ లలో కరెంటు పోవచ్చు. కానీ హైదరాబాద్ లో కరెంట్ పోయే ప్రసక్తి లేదు అని వెల్లడించారు.