KCR : మోడీ సర్కారు పోతుంది.. రైతు ప్రభుత్వం వస్తుంది : కేసీయార్.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : మోడీ సర్కారు పోతుంది.. రైతు ప్రభుత్వం వస్తుంది : కేసీయార్.!

KCR : దేశంలో నరేంద్ర మోడీ సర్కారు పోతుంది, రైతు ప్రభుత్వం వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ‘భారత రాష్ట్ర సమితి’ పేరుతో కేసీయార్ కొత్త రాజకీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రారంభించబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీయార్, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు, గట్టిగా నినదించారు. ఫెడరల్ ఫ్రంట్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 August 2022,1:20 pm

KCR : దేశంలో నరేంద్ర మోడీ సర్కారు పోతుంది, రైతు ప్రభుత్వం వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ‘భారత రాష్ట్ర సమితి’ పేరుతో కేసీయార్ కొత్త రాజకీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రారంభించబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీయార్, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు, గట్టిగా నినదించారు. ఫెడరల్ ఫ్రంట్ అవసరమంటూ స్పష్టం చేశారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలతో మంతనాలు కూడా జరిపారు.

అయితే, ఫెడరల్ ఫ్రంట్ అనేది కార్యరూపం దాల్చలేదు. దాంతో, భారత రాష్ట్ర సమితి నినాదం గులాబీ శ్రేణుల నుంచి మొదలైంది.
ఇప్పుడేమో, రైతు ప్రభుత్వమంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. పెద్దపల్లిలో తాజాగా జరిగిన ఓ బహిరంగ సభలో కేసీయార్, కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. రైతుల్ని నట్టేట్లో ముంచేలా నల్ల చట్టాలు తెచ్చారనీ, రైతుల్ని నాశనం చేసేందుకు మీటర్లు పెట్టాలంటున్నారని కేసీయార్ ఆరోపించారు. ‘కొత్త రాజకీయ పార్టీ పెట్టి, దేశ రాజకీయాల్లోకి రావాలని రైతులు కోరుతున్నారు..

KCR Sensation About'Rythu Prabhutwam'.!

KCR Sensation About ‘Rythu Prabhutwam’.!

ఆ రైతుల ఆలోచన ఫలిస్తుంది.. దేశంలో మోడీ ప్రభుత్వం పోయి, రైతు ప్రభుత్వం వస్తుంది.. ఏం పోదామా జాతీయ రాజకీయాల్లోకి..’ అంటూ తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు కేసీయార్. అయితే, కేసీయార్ మాటల్ని ఎంతవరకు నమ్మవచ్చు.? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. మాటలు చాలా ఎక్కువ చెబుతారు. చేతల్లోనే అడుగు కూడా ముందుకు కదలదు వ్యవహారం. జాతీయ పార్టీ అంటే అంత తేలిక కాదు. ముందైతే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడం కేసీయార్ ముందున్న అతి పెద్ద టాస్క్. ఆ తర్వాతే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది