KCR : ఖమ్మం మీద అంత ఘనం కేసీఆర్ దృష్టి పెట్టడానికి కారణం అదేనా?
KCR : టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారింది. అంతా బాగానే ఉంది కానీ… అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత లక్ష్యం ఏంటి అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. అయితే.. సీఎం కేసీఆర్ ముందు ఇంట గెలవాలని భావిస్తున్నారు. ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చ గెలవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం చివర్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల మీద కేసీఆర్ ఫోకస్ పెట్టారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం దేశ రాజకీయాలు అయినప్పటికీ ముందు తెలంగాణలో గెలవాలి కదా. తెలంగాణలో గెలవకుండా.. పోయి దేశ రాజకీయాలు చేస్తే దేశ ప్రజలు తిప్పి కొడతారు.
అందుకే ముందు తెలంగాణ.. ఆ తర్వాత దేశం. ఏదో ఢిల్లీలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును అయితే ఏర్పాటు చేశారు కానీ.. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎలాంటి కార్యచరణ మాత్రం ప్రారంభం కాలేదు. జాతీయ రాజకీయాల్లో బలపడాలి. కానీ.. దాని కంటే ముందు తెలంగాణలో గెలవాలి. అదే ప్రస్తుతం కేసీఆర్ ముందున్న లక్ష్యం. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కు అండగా ఉంటేనే.. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించవచ్చు. అందుకే.. ముందు తెలంగాణ ప్రజల మద్దతు కోసం సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారు. ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏంటి..
KCR : తెలంగాణలో ఓడిపోతే సీఎం కేసీఆర్ పరిస్థితి ఏంటి?
అనేది ప్రస్తుతం అంతుపట్టని విషయం. నిజంగా అదే జరిగితే.. బీఆర్ఎస్ పార్టీని దేశ ప్రజలు నమ్మరు. సొంత రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీని ఎవరు పట్టించుకుంటారు. ఇప్పటికే కేసీఆర్ రెండు సార్లు తెలంగాణలో సీఎం అయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా సీఎం అయి.. తన సత్తా చాటి అదే ఉత్సాహంతో దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. తెలంగాణను వాడుకొని.. తెలంగాణను అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్ ఢిల్లీ పీఠంపై గురి పెట్టబోతున్నారు. అది వర్కవుట్ అవుతుందా? 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమైనా లబ్ధి చేకూర్చుతుందా? అంటే వేచి చూడాల్సిందే.