Keshineni Nani : మళ్లీ కేశినేని నాని కే బాధ్యతలు.. చంద్రబాబు వ్యూహం ఏమైయుంటుంది?
Keshineni nani : గత ఎన్నికల సమయంలో చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చాయి. జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ పాతాలానికి పడిపోయింది. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ ఇంత దారుణమైన ఓటమిని చవిచూడలేదు. కర్ణుణి చావు సవాలక్ష కారణాలు అన్నాట్టు టీడీపీ ఓటమికి కూడా అన్ని కారణాలు ఉన్నాయని రాజకీయాల్లో జోరుగా చర్చ నడిచింది. ఒక విధంగా చెప్పాలంటే బాబు వైఖరే పార్టీని నిండా ముంచినదని అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. నమ్మకంగా పనిచేసే వారిని దూరం పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించారు.
దీంతో గత ఎన్నికల్లో కష్టపడి పనిచేసే వారు పార్టీకి దూరంగా ఉన్నారని తెలిసింది.విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కేశినేని నాని కాకుండా బలమైన లీడర్లు చాలా మందే ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. కానీ ఈయనంటే విజయవాడలో కీలక నేతలుగా ఉన్న బుద్దా వెంకన్న, నాగులు మీరాలు అస్సలు పడటం లేదు. వీరిని కాదని విజయవాడ పశ్చిమ బాధ్యతలు మళ్లీ నానికే ఇవ్వడం పట్ల వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. నాని కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ మధ్యలో తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనని బాబుకు స్పష్టం చేశారట.. అయితే, అప్పుడు బాబు నానిని లైట్ తీసుకున్నారు.
Keshineni nani : మళ్లీ నానినే బాబు ఎందుకు ఎంచుకున్నారు?
కానీ మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గి ఆయనకే పశ్చిమ బాధ్యతలు అప్పగించారు. అయితే, బెజవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో బుద్దా వెంకన్న, నాగులు మీరాలు కేశినేని నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో బాబు ఎలాంటి చర్యలు తసుకోలేదని నాని అలిగారట.. అయితే, కొండపల్లి మున్సిపల్ ఎన్నికలో కేశినేని నాని కమిట్మెంట్ చూసి మళ్లీ ఆయనకే బాధ్యతలు ఇచ్చారట.. కానీ ఈ నిర్ణయాన్ని బుద్దావెంకన్న, నాగులు మీరాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో నానితో కలిసి పనిచేస్తారా? లేదా అనేది సవాల్‌గా మారింది.