Keerthy Suresh : కీర్తి సురేష్ లా ఉంటా అని చెప్పి 41 లక్ష లు దోచేసిన కిలాడీ లేడీ… పోలీసులను ఆశ్రయించిన యువకుడు..!
Keerthy Suresh : ప్రస్తుత కాలంలో మనీ ట్రాప్ లు ఎక్కువయ్యాయి. కొంచెం ఆదమరచి ఉన్నారంటే చాలు మన జీవితాలను నాశనం చేయాలని చూస్తుంటారు. అలాంటి వారిని గుడ్డిగా నమ్మితే మనకు తెలియకుండానే మనకే గుండు కొట్టేస్తారు. అయితే ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ప్రముఖ స్టార్ హీరోయిన్ అయినా కీర్తి సురేష్ ఫోటోను ఫేస్ బుక్ డిపి గా పెట్టి ఓ కుర్రాన్ని బోల్తా కొట్టించేసింది. తానని తాను ఓ కాలేజ్ అమ్మాయినని చెప్పుకొని యువకుడిని నమ్మించి అతడి బాత్రూం వీడియోను సంపాదించింది. ఇక ఆ వీడియోను అడ్డం పెట్టుకొని బెదిరింపులు చేస్తూ, ఏకంగా 41 లక్షలు దోచేసింది. చిట్ట చివరకు ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆ కిలాడిని పోలీసులు అదుపులోకిి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తేఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని హాసన్ జిల్లా కు చెందిన మంజుల అనే మహిళ ఫేస్ బుక్ వేదికగా ఫేక్ అకౌంట్ ను ఓపెన్ చేసి ఆ ఎకౌంటుకు కీర్తి సురేష్ ఫోటోను కొద్దిగా ఎడిట్ చేసి డిపి గా పెట్టుకుంది. ఇక ఆ తర్వాత కొంతమంది కుర్రాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందట. వారిలో విజయపుర జిల్లాకు చెందిన పరమేశ్వరనే వ్యక్తి ఒకరు. అయితే పరమేశ్వరన్ ఓ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇక అతడు ఆమె రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయడంతో వారి పరిచయం మొదలై చాటింగ్ వరకు వెళ్ళింది. ఇంకా తర్వాత ఇద్దరు కొన్నాళ్లు ఫోన్లో మాట్లా డుకున్నారట. అయితే మంజుల తాను ఒక కాలేజ్ స్టూడెంట్ అని పరిచయం , చేసుకుందట . దీంతో ఆ యువకుడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేసాడట. ఇక మంజులకు కూడా కావాల్సింది అదే కాబట్టి నెమ్మదిగా దువ్వుతూ ఓ రోజు పరమేశ్వరన్ కు ప్రపోజ్ చేసిందట. దీంతో అతను ఓకే చెప్పేసాడట.
దీంతో కొన్నాళ్ళు వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది.ఇది ఇలా సాగుతుండగా ఓ రోజు , అతడు బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను ఆమె తీసుకుని తన ప్లాన్ ను మొదలు పెట్టింది. ఆ వీడియో తన చేతికి వచ్చిన దగ్గర నుండి ఆ వీడియో బయట పెడతానంటూ బెదిరింపులు మొదలుపెట్టిందట. దీంతో అతడు ఆమె అడిగినంత డబ్బులు ఇస్తూ దాదాపుగా 41 లక్షల వరకు ఇచ్చేసాడట. అయినా కూడా ఆమె మితిమీరి పోవడంతో ఏమి చేయలేక పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయం పోలీసులకు తెలియజేసి ఆమెపై ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ స్కామ్ లో ఆమె భర్త కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె భర్త పరారీలో ఉండడంతో పోలీసులు సోదాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇలాంటివి చాలానే జరుగుతుంటాయి కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు చెబుతున్నారు.