PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి ఈసారి 13500 రైతుల ఖాతాల్లో జమ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి ఈసారి 13500 రైతుల ఖాతాల్లో జమ..!

PM Kisan : దేశంలో రైతులు ఆర్ధికంగా బలహీనంగా ఉండటంతో వారికి ఆర్ధిక స్వేచ్చ అందించేలా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఏర్పాట్లు చేస్తుంది. పండించే రైతు సుఖంగా ఉంటే పంటలు బాగుంటాయి అందుకే వారికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు భారత ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పేద […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2024,1:00 pm

PM Kisan : దేశంలో రైతులు ఆర్ధికంగా బలహీనంగా ఉండటంతో వారికి ఆర్ధిక స్వేచ్చ అందించేలా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఏర్పాట్లు చేస్తుంది. పండించే రైతు సుఖంగా ఉంటే పంటలు బాగుంటాయి అందుకే వారికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు భారత ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పేద రైతులకు ఏడాదికి 6000 రూపాయల ఆర్ధిక సహయాన్ని అందిస్తారు. ఐతే ఈ సహయాన్ని ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తారు. ఒక్కో విడత 2000 రూపాయలుగా నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపిస్తారు.

ఐతే ప్రతి వాయిదాకు 4 నెలల టైం తీసుకుంటారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 17 విడతలు చేశారు. జూన్ 18న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సదస్సులో పీఎం నరేంద్ర మోడీ 17వ విడత పథకాన్ని ప్రారంభించారు. 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూపులు.. ఐతే అది రిలీజ్ చేసి నెల రోజులు అవుతంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. మీడియా నివేదికల ప్రాకరం చూస్తే కేంద్రం ఈసారి అక్టోబర్ లో ఈ నిధులను రిలీజ్ చేస్తుందని అంటున్నారు. అంటే 18వ విడత అక్టోబర్ నెలలో ఫండ్ రిలీజ్ అవుతుంది.

PM Kisan

ఐతే ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు ఫ్యామిలీలో రైతు భార్యా భర్తలు ఇద్దరికి అందిస్తారా లేదా అనే ప్రశ్నల్కు కూడా సమాధానం దొరకలేదు. చాలామంది రైతులు ఇలాంటి ఇబ్బందిని తరచు ఫేస్ చేస్తున్నారు. ఐతే ప్రభుత్వ నుంచి మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతల అక్టోబర్ లేదా అంతకంటే ముందే విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది