AP Farmers : ఏపీ రైతులకు జాక్ పాట్.. ఒకేసారి రెండు విడతల డబ్బులు జమ
AP Farmers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం మరియు కేంద్ర ప్రభుత్వ PM కిసాన్ యోజన కలిపి వచ్చే జూలై 18న ప్రతి అర్హ రైతు ఖాతాలో రూ.7,000 నేరుగా జమ కానుంది. ఇందులో రూ.2,000 కేంద్ర ప్రభుత్వం నుంచి, మిగిలిన రూ.5,000 రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇది DBT (Direct Benefit Transfer) విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుందని అధికారుల వారు తెలిపారు.
ఈ పథకాల ప్రయోజనాన్ని పొందాలంటే, మీరు అర్హుల జాబితాలో ఉండాలి. మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే రైతు భరోసా కేంద్రం (RBK) ను సంప్రదించాలి. ఇంకా పేరు లేనివారు జూలై 13లోపు మార్పులు లేదా తాజా నమోదు చేసుకోవచ్చు. ఆ మార్పులు సరైనవైతే, జూలై 18న డబ్బులు ఖాతాలోకి వస్తాయి.
AP Farmers : ఏపీ రైతులకు జాక్ పాట్.. ఒకేసారి రెండు విడతల డబ్బులు జమ
కొంతమంది రైతులకు eKYC పూర్తికాలేదు. అలాంటి వారు వెంటనే eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది, లేనిచో డబ్బు రాకపోవచ్చు. ఏదైనా సందేహాలుంటే, “మనమిత్ర” హెల్ప్‌లైన్ 9552300009 నంబర్‌కు కాల్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రైతుల్లో ఆనందాన్ని నింపింది.