Vangaveeti Radha : వంగవీటి రాధా బంగారం.. టీడీపీ మాజీ ఏమ్మెల్యేపై కొడాలి నాని ప్రశంసలు..!
Vangaveeti Radha : ఏపీ మంత్రి కొడాలి నాని..వంగవీటి రంగా తనయుడు..మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై ప్రశంసల వర్షం కురిపించారు. వంగవీటి రాధా బంగారమని.. కాస్త రాగి కలిపితే ఎటు కావాలంటే అటు వంగొచ్చు అన్నా రాధా అందుకు ఒప్పుకోలేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నేతలు ఆఫర్ ఇచ్చినా..ఆయన అలాంటి పదవులకు ఆశ చూపకుండా తమ పార్టీలో చేరారని అయన గుర్తు చేశారు.
నాని రాధాపై ఈ ప్రశంసలు చేయడానికి కొద్ది గంటల ముందు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కొంతమంది కుట్ర పన్నారని.. ఆ మేరకు రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించారు. అయితే రెక్కీ నిర్వహించిందేవరో త్వరలో బయటకు వస్తుందన్నారు.అలాంటి వ్యక్తులను ఎప్పుడు నమ్మకూడదు అంటూనే వారిని దూరం పెట్టాలని తన అభిమానులకు సూచించారు.

KOdali Nani comments on vangaveeti radha
రంగా కీర్తి, ఆశయాల సాధనే తనకు లక్ష్యమన్న రాధా.. రాజకీయ పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదన్నారు. తనను పొట్టన పెట్టుకోవాలని చూసే వారికి తాను భయపడే రకం కాదని స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానంటూ.. నన్ను లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెడతారని చెప్పుకొచ్చారు.