Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ..!

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లు కొంతమంది మీడియాలో, సోషల్ మీడియా వేదికలపై చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. కొడాలి నానిని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ విషయమై పోలీసు శాఖ అధికారికంగా స్పందించింది. ఆయనను అరెస్ట్ చేయలేదని, ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు తెలిపారు.

Kodali Nani కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ

Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ..!

Kodali Nani : కొడాలి నాని అరెస్ట్.. నిజమేనా..?

గత కొంతకాలంగా కొడాలి నానిపై పలు కేసులు నమోదు కావడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటివరకు ఆయనపై నమోదైన కేసుల నేపథ్యంలో ఏదైనా చర్య తీసుకుంటే అధికారికంగా ప్రకటిస్తామని ఏపీ పోలీసు అధికారులు చెప్పారు. కొడాలి నానిపై కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయని, అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశామని వివరించారు.

ఇకపై కొడాలి నానిపై తీసుకునే ప్రతి చర్యను చట్టపరంగా, నిబంధనల ప్రకారమే చేయనున్నామని పోలీసులు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయని హెచ్చరించారు. అధికారికంగా ప్రకటించకపోయే వరకూ ఎవరు కూడా ఈ తరహా ప్రచారాలను నమ్మవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది