Kodali Nani : హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. ఎలా ఉన్నాడో చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. ఎలా ఉన్నాడో చూడండి..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :24 May 2025,6:15 pm

ప్రధానాంశాలు:

  •  Kodali Nani : హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. ఎలా ఉన్నాడో చూడండి..!

Kodali Nani : వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి ప్రజల్లో కనిపించారు. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో నిన్న జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరుకావడం తో ఆ తాలూకా ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. హార్ట్ ఆపరేషన్ అనంతరం నాని విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు. అలాగే మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్తారని ప్రచారం కూడా జరిగింది. ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలో బాగానే ఉన్నట్లు కనిపించేసరికి అంత నాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Kodali Nani హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని ఎలా ఉన్నాడో చూడండి

Kodali Nani : హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. ఎలా ఉన్నాడో చూడండి..!

Kodali Nani హార్ట్ సర్జరీ తర్వాత కొడాలి నాని ఎలా మారిపోయాడో తెలుసా..?

ఇదే సమయంలో కృష్ణా జిల్లా ఎస్పీ కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. నాని అమెరికా వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నాని హైదరాబాద్‌లో కనిపించడం, అది కూడా కొద్ది గంటల వ్యవధిలోనే ఫోటోలు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాని హాజరైన వివాహ వేడుక ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ, ఆయన్ని చుట్టుముట్టిన వివాదాలను మరోసారి ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాయి.

ఇక నానిపై వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే నానిపై విచారణలు కొనసాగుతున్నాయని, అధికార యంత్రాంగం నిశితంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది