Kodali Nani : జూనియ‌ర్ ఎన్టీఆర్ చెబితే నేనెందుకు వింటా.. కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో..!

Authored By aruna | The Telugu News | Published on: November 25, 2021, 6:30 pm

Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్‌పై ఘ‌టైన వ్యాఖ్య‌లు చేశాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ చెబితే నేనెందుకు వింటా.. సీఎం వైఎస్ జ‌గ‌న్ చెబితే వింటాం అని ఆయ‌న పేర్కొన్నారు. ఏపీలో తాజా ప‌రిణామాల‌పై ఈరోజు మీడియా స‌మావేశంతో మ‌ట్లాడారు. న‌న్ను ఎన్టీఆర్ కంట్రోల్ చేయ‌డ‌మేంటి అంటూ ప్ర‌శ్నించారు. నేను వ‌ల్ల‌భ‌నేని వంశీ సెక్యూరిటీ తీసేసి వ‌స్తామ‌ని, అలాగే చంద్ర‌బాబు కూడా సెక్యూరిటీ తీసేసి వ‌స్తారా అంటూ స‌వాల్ విసిరారు.

Kodali Nani ఎన్టీఆర్ కాదు… మా సీఎం వైఎస్ జ‌గ‌న్ చెబితే వింటా..

Kodali Nani Strong Counter To Jr Ntr

Kodali Nani Strong Counter To Jr Ntr

ఇప్ప‌టికైనా నంద‌మూరి కుటుంబం చంద్ర‌బాబును న‌మ్ముకొవ‌దంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్‌, నంద‌మూరి కుటుంబంతో క‌లిసి ఉన్నాన‌ని, విబేదాలు వ‌చ్చాక నేను బ‌య‌టికి వ‌చ్చాన‌ని కొడాలి నాలి తెలియ‌జేశారు. మా సీఎం ను ( వైఎస్ జ‌గ‌న్ ) ను వేధించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి , చంద్ర‌బాబు నుంచి లోకేష్ వ‌ర‌కు అంద‌రూ స‌ర్వ నాశ‌నం అయ్యార‌ని ఆయ‌న ప్రేర్కొన్నారు.

ఎవ‌రు ఎన్ని వేధింపులు చేసినా సీఎం వైఎస్ జ‌గ‌న్ కు ఆ దేవుడి ఆశిస్సులు ఉంటాయ‌ని నాని తెలిపారు. భార్య‌ను అడ్డుపెట్టుకొని నీచ రాజ‌కీయం చేయెద్ద‌ని చంద్రబాబుపై విమ‌ర్శ‌లు చేశారు. మాజీ సీఎం దివంగ నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వెళ్తూ మ‌ర‌ణించార‌ని, ప్ర‌జా సేవేప‌ర‌మావాదిగా భావించార‌ని ఆయ‌న తెలిపారు. చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ, సింప‌తి కోసం తాప‌త్ర‌య ప‌డుతాడ‌ని ఘ‌టైన వ్యాఖ్య‌లు చేశారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp