kodali-nani-with-his-daughter-in-gudivada-video-viral
Kodali Nani Daughter : ఏపీలోనే ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే రాజకీయాల్లోకి వస్తే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు మాత్రమే వినిపిస్తాయ. అందులో ఒకరు కొడాలి నాని. ఆయనకు ఏపీలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. గుడివాడలో అప్రతిహాతంగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కొడాలి నానికి అక్కడ ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. అందుకే 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలికి మంత్రిగా అవకాశం ఇచ్చారు సీఎం జగన్.
కొడాలి మాట్లాడటం మొదలు పెట్టారంటే.. ప్రతిపక్షాలకు వణుకు పుట్టాల్సిందే. ప్రతిపక్షాలు భయపడాల్సిందే. చంద్రబాబును చూడరు.. లోకేశ్ ను చూడరు.. ఎవ్వరైనా సరే.. తన మాటలకు వెనక్కి మళ్లాల్సిందే. కౌంటర్స్ ఇవ్వడంలో కొడాలి దిట్ట అని అందరికీ తెలుసు. అయితే.. తాజాగా సంక్రాంతి వేడుకల్లో కొడాలి నాని కూతురు కనిపించింది. నిజానికి.. ఆయన ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఆయన కూతురు, ఫ్యామిలీ అంతా కలిసి ఇటీవల సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
kodali-nani-with-his-daughter-in-gudivada-video-viral
కొడాలి నాని కూతురు పేరు తెలియదు కానీ.. ప్రస్తుతం తను వేడుకల్లో పాల్గొన్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడాలి నాని, ఆమె ఇద్దరూ పక్క పక్కన కూర్చున్నారు. అంతే కాదు.. కొడాలి నాని స్టయిల్ ను అచ్చు గుద్దినట్టుగా ఆమె దింపేశారు. కొడాలి నాని ఎలా కాలు మీద కాలు వేసుకుంటారో.. అలాగే ఆయన కూతురు కూడా కాలు మీద కాలు వేసుకుంది. సేమ్ టు సేమ్ లక్షణాలన్నీ కొడాలివే రావడంతో ఆమెను చూసి మరో కొడాలి నాని అంటున్నారు. వైసీపీ అభిమానులు, కొడాలి అభిమానులు మాత్రం మరో కొడాలి అంటూ పొగుడుతున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.