Kolkata Girl : నిద్ర పోటీలు.. అంత సేపు పడుకుని ఏకంగా రూ.5లక్షలు గెలిచిన యువతి!
Kolkata Girl : చాలా మంది డబ్బులు సంపాదించేందుకు ఎంతో కష్టపడుతుంటారు. మరికొందరు సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఇతరులను మోసం చేస్తుంటారు.అయితే, వీరిద్దరిలో నిజాయితీగా డబ్బులు సంపాదించిన వారికి మాత్రమే విలువ ఉంటుంది. ఇతరులు ఏదో ఒక రోజు తాము చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఈ మధ్యకాలంలో చాలా మంది తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలని అన్వేషణ సాగిస్తున్నారు. అయితే, కష్టపడకుండా కేవలం నిద్రపోతే డబ్బులు వస్తాయంటే మీలో ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా..? కానీ ఇది వాస్తవం. ఓ యువతి రోజు 9 గంటలు పడుకుని ఏకంగా రూ.5లక్షలు సంపాదించింది. అదేలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Kolkata Girl : కోల్‌కతా యువతి మిరాకిల్
ఈ మధ్యకాలంలో చాలా మంది డబ్బుల సంపాదనలో పడి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. మరికొందరు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఫలితంగా వారు సంపూర్ణంగా నిద్రపోవడం లేదని తెలుస్తోంది .దీనికి తోడు ఫ్యామిలీ టెన్షన్స్, జాబ్ టెన్షన్, స్టడీ టెన్షన్, లైఫ్ లో ఎలా సెటిల్ కావాలనే టెన్షన్, ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి చిన్నవిషయానికి నేటి తరం టెన్షన్ పడుతూనే ఉంది. దీంతో వారు సరిగా నిద్రపోవడం లేదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో 60 ఏళ్లలో వచ్చే జబ్బులను కేవలం 40 ఏళ్లకే తెచ్చుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలోనే ఓ స్లీప్ సొల్యూషన్ కంపెనీ నిద్ర పోటీలు నిర్వహించింది. ఇందులో కోల్‌కతాకు చెందిన త్రిపర్ణ చక్రవర్తి పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఏకంగా రూ.5 లక్షలు గెలుపొందింది.ఈ కంపెనీ సుమారు 100 రాత్రులు ఇందులో పోటీ చేసిన వారి నిద్రను పరిశీలించింది.
పోటీలో పాల్గొన్న వారిలో రోజుకు 9 గంటలు హాయిగా నిద్రపోయిన త్రిపర్ణ చక్రవర్తి ఏకంగా రూ.5లక్షలు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిద్ర పోతే కూడా డబ్బులు ఇస్తారా అని కొందరు షాక్ అవుతున్నారు. భారతీయుల్లో నిద్రకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి నిర్వహించిన పోటీల్లో త్రిపర్ణ చక్రవర్తి అందరికంటే ఎక్కువగా నిద్రపోయి బహుమతి గెలుచుకుందని వారు ప్రకటించారు. అంతేకాకుండా దేశంలోనే ప్రశాంతంగా నిద్రపోయే యువతిగా త్రిపర్ణ రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఆమెకు మరో కంపెనీ కూడా ఆఫర్ ఇచ్చింది. రోజుకు 10 గంటలు నిద్రపోతే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఇప్పుడు ఆ పోటీకి కూడా సిద్ధమవుతున్నట్లు త్రిపర్ణ ప్రకటించింది. అయితే, ఈరోజుల్లో చాలా మంది యువత ఎవరూ 8 గంటలు సరిగా నిద్రపోవడం లేదని తెలుస్తోంది. కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే పోతున్నట్టు సమాచారం.