Komati Reddy Venkata Reddy : రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Komati Reddy Venkata Reddy : రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ..!

 Authored By anusha | The Telugu News | Updated on :6 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Komati Reddy Venkata Reddy : రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ..!

Komati Reddy Venkata Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నల్గొండ ఎమ్మెల్యే. ఆయన నిత్యం వార్తలో నిలుస్తూ ఉంటారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఎన్నికల ముందు ప్రచారంలో కోమటిరెడ్డి చాలా సన్నిహితంగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సీఎం ఎవరు అవ్వాలనే సందిగ్ధంలో కోమటిరెడ్డి నోరు జారలేదు. ఎవరికి వ్యతిరేకత చూపలేదు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులైన సీఎం పదవి కోసం అత్యుత్సాహం చూపలేదు. ఇక రేవంత్ రెడ్డిని సీఎంగా ఎన్నుకున్నారు. హై కమాండ్ కూడా రేవంత్ రెడ్డి సీఎం అని స్పష్టత ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లెటర్ రాశారు. ఈ లేఖలో ఆసక్తికర విషయాలను పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న యనమల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలను నెరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది.

సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన కానుక ఇది అని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులు వండిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున కర్గె ఇతర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి పిసిసి అధ్యక్షుడు సారధ్య వహించి నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం రేవంత్ రెడ్డి గారికి హర్షించదగ్గ విషయం. అందుకు సోదరుడికి రేవంత్ రెడ్డికి నా శుభాకాంక్షలు అని కోమటిరెడ్డి తెలిపారు. ఇక పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రం అని మరిచిపోయి అన్యాయం చేశారు. అవన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే ఈ చరిత్రాత్మక తీర్పు నిచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ లేరని ఇతర పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజాస్వామిక విధానాలు అమలు అవుతాయనేది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్య జనం కావచ్చు, ఉమ్మడి నిర్ణయాలు పార్టీకి బలంగా అనే విషయం తెలిసింది.

ఇవే సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రిని ఎన్నుకొని అధిష్టానానికి తీర్మా నం కూడా పంపారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. మిగతా పార్టీల ప్రాంతీయ పార్టీల్లా కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక విధానానికి కట్టుబడి ఉంది. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజాపాలనకు దోహదపడుతుందని సోదరుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో పాలన వర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక ప్రజా అనుకూల ప్రభుత్వం రాబోతుంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుంది. సోదరుడు రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో తెలిపారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది