OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండదు
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ అసహనం వ్యక్తం చేసిన మంత్రి, ఇకపై రాష్ట్రంలో ఏ సినిమా అయినా ఒకే టికెట్ ధర విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

#image_title
ఆ నిర్ణయం నాకు తెలియదు..
“ఆంధ్రప్రదేశ్‌లో ఓజీ సినిమాకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చారు కాబట్టి, ఇక్కడ కూడా అలాగే అనుకోవచ్చు. కానీ, నాకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇకపై చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ఒకే ధర విధిస్తాం అని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్ల పెంపుపై స్టే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఓజీ సినిమా టికెట్లను ప్రీమియర్ షోలకు రూ. 800, సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, బుధవారం హైకోర్టు ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ, టికెట్లను సాధారణ రేట్లకే విక్రయించాల్సిందిగా ఆదేశించింది.ఈ తీర్పును మంత్రి కోమటిరెడ్డి స్వాగతించారు.