రేవంత్‌రెడ్డిపై మ‌రోసారి స్పందించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రేవంత్‌రెడ్డిపై మ‌రోసారి స్పందించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

 Authored By uday | The Telugu News | Updated on :4 June 2021,6:05 pm

komatireddy venkat reddy తెలంగాణ‌ కాంగ్రెస్ వ‌ర్కింగ్ వర్కింగ్ పెసిడెంట్ రేవంత్‌రెడ్డికి నాకు ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని న‌ల్గొండ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి komatireddy venkat reddy వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు కారోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వాల‌ని డిమాండ్‌తో ఈ రోజు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌పై సౌంద‌ర‌రాజ‌న్ రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు విన‌తిప్ర‌తం ఇచ్చారు. అయితే ఈ సంద‌ర్బంగా అక్క‌డ కాంగ్రెస్ నేత‌లు కోమ‌టిరెడ్డి మ‌రియు రేవంత్ రెడ్డి కొద్ది సేపు మాట్లాడుకున్నారు. మా మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని కోమ‌టిరెడ్డి తెలిపారు.

komatireddy venkat reddy comments on Revanth reddy

komatireddy venkat reddy comments on Revanth reddy

టీపీసీసీ ప‌ద‌వి కోసం.. komatireddy venkat reddy

దుబ్బాక బై ఎల‌క్ష‌న్ లో కాంగ్రెస్ ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే అప్ప‌టి నుండి కొత్త టీపీసీసీ ఎంపీక కోసం హైక‌మాండ్ ప్ర‌య‌త్నం చేస్తున్నా ఇప్ప‌టికీ అది పూర్తి కాలేదు. ఆ టీపీసీసీ ప‌ద‌వి రేస్‌లో ముందుగా రేవంత్‌, కోమ‌టిరెడ్డి komatireddy venkat reddy పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విష‌యంపై ఈ ఇద్దరు నేత‌ల‌కు ప‌డ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీలో తెగ చ‌ర్చ జ‌రుగుంది.

Telangana Congress

Telangana Congress

అయితే ఈ రోజు రాజ్‌భ‌వ‌న్‌లో రేవంత్‌రెడ్డి , కోమ‌టిరెడ్డి komatireddy venkat reddy మాట్లాడుకోవ‌డంతో కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. మేము ఇద్ద‌రం కూడా క‌లిసే ఉన్నాం అని ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే టీపీసీసీ ప‌ద‌వి నియామ‌కం కోసం కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఈ మేర‌కు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కొరిన మాణికం ఠాగూర్‌. కాంగ్రెస్ పార్టీలో కొంద‌రు ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని బాహాటంగానే చెబుతున్నారు. మ‌రికొంద‌రు హైక‌మాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది