Revanth Reddy : రేవంత్ రెడ్డికే టీపీసీసీ పీఠం.. కోమ‌టిరెడ్డి, పొన్నంలకు ఆ ప‌ద‌వులు… రేపే ప్రకటన..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Revanth Reddy : రేవంత్ రెడ్డికే టీపీసీసీ పీఠం.. కోమ‌టిరెడ్డి, పొన్నంలకు ఆ ప‌ద‌వులు… రేపే ప్రకటన..?

Revanth reddy : హమ్మయ్య.. ఎట్టకేలకు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న టీపీసీసీ పీఠానికి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా దుబ్బాక ఉపఎన్నిక తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరా అని అందరూ టెన్షన్ తో ఎదురు చూశారు. అయితే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామందే టీపీసీసీ చీఫ్ పీఠం కోసం పోటీ పడినా.. ఎక్కువ ప్రాధాన్యత మాత్రం మొదటి నుంచీ హైకమాండ్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 June 2021,6:09 pm

Revanth reddy : హమ్మయ్య.. ఎట్టకేలకు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న టీపీసీసీ పీఠానికి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా దుబ్బాక ఉపఎన్నిక తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరా అని అందరూ టెన్షన్ తో ఎదురు చూశారు. అయితే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామందే టీపీసీసీ చీఫ్ పీఠం కోసం పోటీ పడినా.. ఎక్కువ ప్రాధాన్యత మాత్రం మొదటి నుంచీ హైకమాండ్ రేవంత్ రెడ్డికే ఇస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోనే ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్ రెడ్డికే టీపీసీసీ పీఠం దక్కనుందని చాలా రోజుల నుంచి ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో నాగార్జున సాగర్ ఉపఎన్నికల వల్ల.. టీపీసీసీ చీఫ్ పదవి నియామకం లేట్ అయిందని.. ఇంకా లేట్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుందని భావించిన హైకమాండ్.. వెంటనే టీపీసీసీ చీఫ్ ను నియమించాలని అనుకుంటోందట. అందుకే.. టీపీసీసీ చీఫ్ నియామకాన్ని త్వరలోనే చేపడతారని వార్తలు వచ్చాయి.

revanth reddy to be tpcc chief congress

revanth reddy to be tpcc chief congress

అయితే.. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.. టీపీసీసీ చీఫ్ పేరును ఫైనల్ చేశారట. నిజానికి.. టీపీసీసీ చీఫ్ రేస్ లో చాలామందే ఉన్నా.. చివరకు రేవంత్ రెడ్డినే కన్ఫమ్ చేశారట రాహుల్ గాంధీ. రేవంత్ కన్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. రేవంత్ కన్నా.. ఒక మెట్టు ముందే ఉన్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి వైపే రాహుల్ గాంధీ మొగ్గు చూపారని తెలుస్తోంది. అలాగే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న అంటే రేపే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తారనే వార్తలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

Revanth Reddy : ఏఐసీసీలోకి కోమటిరెడ్డి, పొన్నం?

అయితే.. టీపీసీసీ చీఫ్ రేస్ లో ఉన్న మిగితా నేతలు అసంతృప్తి చెందకుండా.. వాళ్లకు కూడా కొన్ని పదవులను రాహుల్ గాంధీ కేటాయించారట. పీసీసీ చీఫ్ రేస్ లో ఉన్న కోమటిరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శిగా నియమించనున్నారట. అలాగే పొన్నం ప్రభాకర్ ను కూడా ఏఐసీసీలోకే తీసుకొని.. దాంట్లోనే ఏదైనా పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక.. మిగితా సీనియర్ నేతలు అయిన దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్ లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించనున్నారట. ఏది ఏమైనా.. అన్ని వర్గాలకు న్యాయం చేకూరాలని.. అందరూ సీనియర్ నేతలకు పదవులు దక్కాలని.. ఎవ్వరూ అసంతృప్తికి లోను కాకూడదని భావించి.. రాహుల్ గాంధీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ.. కుదరలేదు. రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగానే ప్రయత్నించినా.. ఈటల రాజేందర్ మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆయన కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈటలపై ఆశలు వదిలేసుకుంది. ఇక.. ఏది ఏమైనా.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందడుగు వేయాలని.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సూచించారట. ఇక.. చూద్దాం మరి.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2023 లో తెలంగాణలో విజయకేతనం ఎగురవేస్తుందో లేదో?

ఇది కూడా చ‌ద‌వండి==> టీఆర్ఎస్ దాడి నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరుతున్న ఈటల’

ఇది కూడా చ‌ద‌వండి==> ఒక్క చేప ధ‌ర 72 లక్ష‌లు.. ఆ మత్స్యకారుడిని లక్షాధికారిని చేసింది.. దాని ప్ర‌త్యేక‌త ఏమిటి…?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది