Kotam Reddy Sridhar Reddy : అసలు వైఎస్సార్సీపీ పార్టీలో ఏం జరుగుతోంది. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు షాక్ ఇస్తున్నారు. నిజంగా ఇది వైసీపీకి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 కు 175 సీట్లు గెలవాలని చూస్తుంటే జగన్ కు వీరవిధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలే ఇప్పుడు ధమ్కీ ఇస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నారట. కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మాత్రమే కాదు.. వైసీపీ పార్టీ నుంచి కూడా ఆయన బయటికి రావాలని చూస్తున్నారని
గత కొన్ని రోజుల నుంచి మీడియా కోడై కూస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయన ప్రవర్తన కూడా ఉంది. ఆయన అనుచరులతో భేటీ అవడం.. ఇదివరకు వైసీపీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. నిజానికి ఆయన వైసీపీకి, సీఎం జగన్ కు వీర భక్తుడు. అలాంటి నేత ఇంత సడెన్ గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మిగిలింది. కోటం రెడ్డి గురించి తెలిసి ముందే జగన్ ఆయనకు క్లాస్ పీకారట. అంతే కాదు.. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి ఈ విషయాన్ని అప్పజెప్పారట జగన్. అదిగో అక్కడే కోటంరెడ్డికి మండిందట. అసలు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్సలు పడదు.

Kotam Reddy Sridhar Reddy : కాకాని వర్సెస్ కోటంరెడ్డిగా నెల్లూరు జిల్లా రాజకీయాలు
ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు కాకానికి జగన్ ఈ విషయాన్ని అప్పగించడంతో కోటం రెడ్డికి ఇంకా చిర్రెత్తుకొచ్చిందట. అందుకే.. పార్టీకి రాజీనామా చేయాలని.. అప్పటి నుంచి తన సన్నిహితులు, అభిమానులు, అనుచరులతో భేటీ అవుతున్నారు కోటంరెడ్డి. కోటంరెడ్డికి మెయిన్ గా వచ్చిన సమస్య మంత్రి పదవి దగ్గర. 2014, 2019 రెండు ఎన్నికల్లో నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన్ను కాదని.. సొంత పార్టీలోనే ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న కాకానికి జగన్ మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి కోటంరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇవాళో.. రేపో తన రాజీనామాను ప్రకటించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి.. కోటంరెడ్డిని సీఎం జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో?