కేటీఆర్ సీఎం అవుతున్నారు ఓకే.. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఫామ్ హౌస్ కే పరిమితమా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KTR : కేటీఆర్ సీఎం అవుతున్నారు ఓకే.. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఫామ్ హౌస్ కే పరిమితమా?

2014లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలిచాక.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండుమూడేళ్లకే తన కొడుకు కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. 2018 లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. రెండో సారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ.. ఇప్పటి వరకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయలేదు. కానీ.. ఇక సమయం వచ్చేసిందట. ఇన్ని రోజులు ఒక లెక్క.. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 January 2021,9:35 am

2014లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలిచాక.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండుమూడేళ్లకే తన కొడుకు కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. 2018 లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. రెండో సారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ.. ఇప్పటి వరకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయలేదు. కానీ.. ఇక సమయం వచ్చేసిందట. ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క.. ఆయన కొడుకొచ్చాడని చెప్పు అని ఏదో సినిమాలో చెప్పినట్టుగా కేటీఆర్ త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ కూడా ముహూర్తం పెట్టేశారట. ఫిబ్రవరిలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో.. అందరిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. అదే కేసీఆర్ నెక్స్ ట్ కర్తవ్యం ఏంటి?

ktr to become telangana chief minister

ktr to become telangana chief minister

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ఓకే.. బాగానే ఉంది. కానీ.. కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఆయన ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదు. ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోతారా? రాజకీయాలను వదిలేస్తారా? కేటీఆర్ కే ముఖ్యమంత్రి పీఠంతో పాటు.. టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను అప్పగించి.. తాను తడిగుడ్డ వేసుకొని రెస్ట్ తీసుకుంటారా? లేక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? ఢిల్లీ వెళ్లి అక్కడ రాజకీయాలను చేస్తారా? అనే సందేహాలు తెలంగాణ ప్రజలకు కలుగుతున్నాయి.

ఎందుకంటే.. ఒక్కసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక తెలంగాణలో కేసీఆర్ కు పనేమీ ఉండదు. అన్నీ కేటీఆర్ చూసుకుంటారు. పార్టీ వ్యవహారాలు కూడా కేటీఆర్ చూసుకుంటే.. కేసీఆర్ తో అవసరం ఉండదు కదా.

కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?

మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ ను సమర్థిస్తున్నారు. కేటీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అంటూ మీడియానే ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అయిపోయినట్టే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది