ChandraBabu : వైసీపీ వ్యూహం కుప్పంలో చంద్రబాబుకి ఇకపై నో ఛాన్స్.!
ChandraBabu : ఇంకా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంపై ఆశలేమన్నా పెట్టుకుని వుంటే, అవి పక్కన పడేయడం మంచిది. ఇంకేదన్నా నియోజకవర్గాన్ని చంద్రబాబు వెతుక్కోవడం ఆయనకే మంచిదంటూ అధికార వైసీపీ ఎగతాళి చేస్తోంటే, ‘నన్ను కుప్పంలో ఓడించే ధైర్యం ఎవరికి వుంది.?’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత.చాలాకాలంగా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న మాట వాస్తవం. అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ దారుణంగా తగ్గిపోయింది.
చంద్రబాబు ఓడిపోబోతున్నారంటూ తొలుత ప్రచారం జరిగింది. కానీ, చంద్రబాబు ఎలాగోలా గట్టెక్కేశారు. అధికారంలోకి వస్తూనే కుప్పం నియోజకవర్గంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. కుప్పం మనకే దక్కాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రదారెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన సూచనలు చేశారు.ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి తన రాజకీయ చాణక్యాన్నంతా ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీని దారుణంగా దెబ్బతీశారు.

Kuppam, No Chance For Chandrababu Naidu Next Time
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరిగి తన రెండో క్యాబినెట్‌లోనూ వైఎస్ జగన్ కొనసాగించడానికి ‘కుప్పం’ కోసం పెద్దిరెడ్డి పడ్డ కష్టమే కారణమంటారు వైసీపీలో చాలామంది నాయకులు. 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని పెద్దిరెడ్డి చెబుతుండడం గమనార్హం.సో, చంద్రబాబుకి వేరే ఆప్షన్ లేదు. కుప్పం వదిలి పోవాల్సిందేనన్నమాట.