
Lady conistable selling flowers: ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి..! కానీ ఇంటి నుంచి పారిపోయి రాష్ట్రంకాని రాష్ట్రానికి చేరింది..! అక్కడ ఓ గుడి ముందు పూలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నది…! ఇంతకూ ఎవరా మహిళ..? ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి పూలు అమ్ముకోవడం ఏమిటి..? ఎందుకలా చేసింది..? అనే వివరాల్లోకి వెళ్తే.. ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఓ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. తొమ్మిది నెలల క్రితం ఆమెను రాయ్‌పూర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.
మరి ఏమైందో ఏమోగానీ ఇటీవల సదరు మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. అయితే, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేదంటే తనంతట తానుగా వెళ్లిపోయిందా అనేది కుటుంబసభ్యులకు అర్థంకాలేదు. బంధువులు, తెలిసిన వాళ్లను వాకబు చేసినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆగస్టు 21న ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కిడ్నాప్ కేసు కావడం, పైగా ఆ మహిళ పోలీస్ కానిస్టేబుల్ కూడా కావడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
ఆమె ఆచూకీని కనిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే, ఆమె వెంట కనీసం మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లకపోవడంతో కేసును చేధించడం కష్టంగా మారింది. ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె బ్యాంక్ ట్రాన్షక్షన్స్‌ను పరిశీలించగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ఏరియాలోగల ఓ ఏటీఎం నుంచి ఆమెను డబ్బులు డ్రా చేసినట్లుగా తేలింది. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లాడు.
అక్కడ ఆమె కోసం వెతుకుతుండగా కృష్ణుడి ఆలయం ముందుగల ఓ పూల దుకాణంలో పూలు అమ్ముతూ కనిపించింది. ఇది చూసి పోలీసులు షాకయ్యారు. తమ వెంట ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. తాను అక్కడే ఉంటానని తెగేసి చెప్పింది. కారణం అడిగితే తనను పై అధికారులు వేధిస్తున్నారని చెప్పింది. కానీ ఆ అధికారులు ఎవరో చెప్పమంటే చెప్పలేదు. ఉద్యోగానికి కాకపోయినా తన ఇంటికి వెళ్లమని చెప్పారు. అందుకు కూడా ఆమె నిరాకరించింది.
దాంతో పోలీసులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. బాధిత కుటుంబసభ్యులకు సదరు మహిళ ఆచూకీ తెలియజేశారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.