Railway Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. 2,65,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్.. అర్హత ఏంటో తెలుసా?
Railway Jobs : నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. దాదాపు 2,65,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ప్రస్తుతం భారత రైల్వే విభాగంలో దాదాపు 2,65,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజ్యసభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం రైల్వేలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 2177 గెజిటెడ్ పోస్టులు అని.. మిగితావి నాన్ గెజిటెడ్ పోస్టులు 263370 ఉద్యోగాలని తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఈ సంవత్సరమే నోటిఫికేషన్ విడుదల చేసి.. నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.
గెజిటెడ్ పోస్టుల్లో సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వేలో 43 ఖాళీలు ఉన్నాయి. నాన్ గెజిటెడ్ పోస్టుల్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో 16741 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.గెజిటెడ్ పోస్టులకు డిగ్రీ అర్హత ఉండాలి. నాన్ గెజిటెడ్ పోస్టుల్లో కొన్ని పోస్టులకు పదో తరగతి, మిగితా పోస్టులకు ఇంటర్ అర్హత ఉండాలి.గెజిటెడ్ పోస్టుల్లో సెంట్రల్ రైల్వేలో 56 ఖాళీలు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 87, ఈస్టర్న్ రైల్వేలో 195, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 170, మెట్రో రైల్వేలో 22, నార్త్ సెంట్రల్ రైల్వేలో 141, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 62, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 112, నార్తర్న్ రైల్వేలో 115, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 100 ఖాళీలు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 88, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 137, సౌతర్న్ రైల్వేలో 65, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 59, వెస్టర్న్ రైల్వేలో 172తో పాటు మరికొన్ని రైల్వే డిపార్ట్ మెంట్స్ లో 507 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Railway Jobs : సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి
ఇక.. నాన్ గెజిటెడ్ విభాగంలో సెంట్రల్ రైల్వేలో 27177 పోస్టులు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 8447, ఈస్టర్న్ రైల్వేలో 28204, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 15268 ఖాళీలు, మెట్రో రైల్వేలో 856, నార్త్ సెంట్రల్ రైల్వేలో 9366, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 14231, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 15477, నార్తర్న్ రైల్వేలో 37436, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 15049, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 9422, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 16847, సౌత్ ఇండియన్ రైల్వేలో 9500, సౌత్ వెస్టర్న్ రైల్వేలో 6525, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 11073, వెస్టర్న్ రైల్వేలో 26227తో పాటు ఇతర రైల్వే డిపార్ట్ మెంట్స్ లో 11073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఈ పోస్టులను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ఈ సంవత్సరం భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.