lashkar bonalu : లష్కర్ బోనాలు 2021.. భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత
lashkar bonalu సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు ఉత్సవాలలో కీలక ఘట్టమైన భవిష్యవాణినిని జోగిని స్వర్ణలత అమ్మవారి స్వరూపమై వినిపించారు. గత ఏడాది కరోనా కారణంగా నిర్వహించలేక పోయామని, ఈ సంవత్సరం ఎన్ని కష్టాలు ఎదురైనా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పూజారులు తెలపడంతో…. అనేక ఆటంకాలు ఎదురైనా ఈ సంవత్సరం ఉత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉన్నానన్నారు.

lashkar bonalu bhavishyavani 2021
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారు సంతోషంగా ఉండేలా చూసుకుంటామన్నారు. కానీ వర్షాల వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. అయినా ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరికి నేను అండగా ఉంటానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను అండగా ఉంటానని అభయాన్నిచ్చారు. ఎవరూ నిరాశ చెందవద్దని , తాను ప్రజల ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ముందుకు నడిపిస్తానని చెప్పడంతో భక్తులు సంతోషించారు.