Telangana : తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ సడలింపులు.. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు?
Telangana : తెలంగాణలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత నెలతో పోల్చితే.. ఈ నెల కేసులు విపరీతంగా తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ సడలింపులను చేస్తూ వచ్చింది. ముందు ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపులను ఇచ్చారు. ఆ సమయంలో కరోనా విపరీతంగా ఉంది. ఆ తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు సడలింపులు ఇచ్చారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపులు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం లాక్ డౌన్ ఈనెల 19 తో ముగియనుంది.
దీంతో మరోసారి తెలంగాణ మంత్రివర్గం త్వరలోనే భేటీ కానున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కు సంబంధించి ఇంకా సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమయాన్ని ఇంకా పెంచి.. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు సమయాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే.. కర్ఫ్యూను మాత్రం కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రం చాలా కఠినంగా కర్ఫ్యూను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే జరిగే కేబినేట్ మీట్ లో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
Telangana : రాత్రి 9 వరకు సడలింపు ఇచ్చి.. గంట సమయం ఇంటికి చేరుకోవడానికి
ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు సడలింపును ఇస్తే.. అన్ని కార్యకలాపాలు చేసుకోవచ్చు. అన్ని షాపులు రాత్రి 9 వరకు తెరిచి ఉంచుకోవచ్చు. రాత్రి 9 దాటాక.. అన్ని షాపులు, ఇతర పనులన్నీ ముగించేసుకొని ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. రాత్రి 9 నుంచి రాత్రి 10 వరకు ప్రజలు తమ ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక.. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు తీవ్రంగా లాక్ డౌన్ అమలులో ఉండనుంది. మొదట్లో లాక్ డౌన్ పెట్టడానికి ముందు.. ప్రభుత్వం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లాక్ డౌన్ ను విధించింది.