LPG Gas Cylinders : LPG గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.. డబ్బులు అకౌంట్ లోకి జమ చేస్తున్నారు..!
ప్రధానాంశాలు:
LPG Gas Cylinders : LPG గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.. డబ్బులు అకౌంట్ లోకి జమ చేస్తున్నారు..!
LPG Gas Cylinders : తెలంగాణా లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మంచి ఉపశమనం కలిగేలా నవీకరణాలు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే సబ్సీడీతో గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ వినియోగదారులంతా కూడా సిలిండర్లను 500 రూపాయలకే పొందే అవకాశం ఉంటుంది. ఐతే మొదట వినియోగదారులు పూర్తి మొత్తం సిలిండర్ కు చెల్లిస్తే ఆ అర్వాత ప్రభుత్వం సబ్సీడీని వారి బ్యాంక్ ఖాతాలో వేస్తుంది. ఐతే గ్యాస్ సిలిండర్ తీసుకున్న ఎప్పుడో సబ్సీడీ అమౌంట్ కాకుండా గ్యాస్ తీసుకున్న 48 గంటల్లోనే వినియోగదారులకు మిగిలిన మొత్తాన్ని చెల్లించేలా ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ ద్వారా ఆలస్యం కాకుండా చెల్లింపులు వెంటనే చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు చెల్లింపుల గురించి ఆందోళన చెందే అవకాశం ఉండదు.
LPG Gas Cylinders కొత్త రేషన్ కార్డులను ఇచ్చేలా..
సబ్సీడీ క్రెడిట్ ఖాతాల్లో జమ చేశాక వారికి ఒక మెసేజ్ రూపంలో అందించాలని చూస్తుంది. ఇదే కాదు జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులను ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తుంది. కొత్త రేషన్ కార్డుదారులందరికీ చిన్న బియ్యం పంపిణి అమలు చేయాలని చూస్తుంది. రాయితీ పథకం కింద గోధుమలు కూడా పంపిణి చేయాలని చూస్తున్నారు.
రేషన్ పంపిణి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చేస్తుంది. నిబంధనలు పాటించకుండా చేస్తే జరిమానాలు తప్పవని రేషన్ షాప్ డీలర్స్ కు చెబుతుంది. ప్రజలకు ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం రేషన్ అందిస్తుంది. ఐతే కొందరు డీలర్లు రేషన్ అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం ఉపేక్షించేది లేదని తెలుస్తుంది. కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే రేషన్ డీలర్ షిప్ కూడా క్యాన్సిల్ చేసేలా ప్రభుత్వం నిర్ణయించుకుంది.