Magnet Man Video : కరోనా టీకా తీసుకున్నాకా… అయస్కాంతంలా మారిన అత‌ని శ‌రీరం..!

0
Advertisement

Magnet Man : కరోనా టీకా వేయించుకున్నవాళ్లు సహజంగా తమకు తీవ్ర జ్వరం వచ్చిందనో, విపరీతమైన ఒళ్లు నొప్పులతో బాధపడ్డామనో చెబుతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం వింత వాదన వినిపిస్తున్నాడు. రెండో డోస్ తీసుకున్నాక తన శరీరం అయస్కాంతంలా పనిచేస్తోందని చెబుతున్నాడు. తన బాడీకి ఇనప వస్తువులు అంటుకుంటున్నాయని పేర్కొంటున్నాడు. అతని కుటుంబ సభ్యులు సైతం అదే అంటున్నారు. ఈ విషయాన్ని తాము మొదట్లో పెద్దగా పట్టించుకోలేదని, చెమట వల్లే అలా జరుగుతోందనుకున్నామని తెలిపారు. ఇప్పుడు మాత్రం తమకి ఆందోళనగా ఉందని, ఒంటి మీద చెమట పోవటానికి స్నానం చేసి కండువాతో తూడ్చుకున్న తర్వాత కూడా ఇలాగే జరుగుతోందంటూ టెన్షన్ పడుతున్నారు.

Man magnetic powers after taking second dose
Man magnetic powers after taking second dose

డాక్టర్లు ఏమంటున్నారు?..

అతనికి ఎందుకిలా జరుగుతోందో తమకు కూడా అర్థం కావట్లేదని వైద్యులు అన్నారు. మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప చెప్పలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. బాధితుణ్ని స్వయంగా పరిశీలించిన తర్వాత వాళ్లు మాట్లాడుతూ ఈ సంఘటనపై తొందరపడి ఎలాంటి ప్రకటనలూ చేయబోమని, కొవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ఇలా అవుతోందని ఇప్పుడే ధ్రువీకరించలేమని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, పై నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే అవి పాటిస్తామని డాక్టర్ అశోక్ థొరాట్ వివరించారు.

కొసమెరుపు ఏంటంటే?..: Magnet Man

మ్యాగ్నెటిక్ పవర్స్ పొందిన ఆ మనిషి పేరు అర్వింద్ సోనార్. నాసిక్ నగరం(మహారాష్ట్ర)లోని శివాజీ చౌక్ ప్రాంతంలో ఉంటున్నాడు. సీనియర్ సిటిజన్. చెంచాలు, గరిటెలు, ప్లేట్లు, నాణేలు.. ఇలా ప్రతి ఇనప వస్తువునూ తన శరీరం ఆకర్షిస్తున్న వైనాన్ని ఇతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

Nashiks Shivaji Chowk
Nashiks Shivaji Chowk

ఆ వీడియోని చూశాక నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యులు అర్వింద్ ఇంటికి వచ్చి చేశారు. డాక్టర్లు కూడా ఎందుకిలా జరుగుతోందో చెప్పలేకపోయేసరికి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీలోని ఒక వ్యక్తి కరోనా టీకా రెండో డోస్ వేయించుకున్నాక అయస్కాంత శక్తిని పొందినట్లు ఇంటర్నెట్ లో వీడియో చూశానని, తన తండ్రికి కూడా ఇలాగే అవుతుందేమో చూద్దాం అంటూ ట్రై చేశామని అర్వింద్ కొడుకు జయంత్ చెప్పటం కొసమెరుపు. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ప్రతిఒక్కరూ ఇలాగే ట్రై చేస్తారేమో అనిపిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==>  దారుణం… భ‌ర్త ఆ పార్ట్‌ను కోసి పెనంపై కూర వండిన భార్య…!

ఇది కూడా చ‌ద‌వండి ==> దారుణం : పెళ్లయిన రోజే.. ఆ పని చేయలేదని భార్య ప్రాణం తీసిన భర్త?

ఇది కూడా చ‌ద‌వండి ==> వైర‌ల్ వీడియో.. 28 మంది భార్య‌ల సాక్షిగా 37వ పెళ్లి చేసుకున్న వృద్ద వ‌రుడు..!

ఇది కూడా చ‌ద‌వండి ==>  రష్మి గౌతమ్- సుధీర్ ల రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కి షేకవుతున్న యూట్యూబ్

Advertisement