దారుణం : పెళ్లయిన రోజే.. ఆ పని చేయలేదని భార్య ప్రాణం తీసిన భర్త?

0
Advertisement

పెళ్లి అనేది జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయే రోజు. కానీ.. ఆ పెళ్లి అయిన రోజే.. ఆ జంట జీవితం ముగిసిపోతే ఎలా ఉంటుంది? వాళ్లకేమో కానీ.. వాళ్లను కన్న తల్లిదండ్రుల బాధ మాత్రం వర్ణణాతీతంగా ఉంటుంది. పెళ్లి అయిన రోజే.. కాళ్లకు పారాణి కూడా ఆరకముందే.. ఆ పెళ్లి కూతురు పాడె ఎక్కితే.. ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రుల ఏడుపును ఎవ్వరు ఆపగలరు చెప్పండి. పెళ్లి అయిన రోజును ఎంత అపురూపంగా భావిస్తాం. పెళ్లి అయిన సంవత్సరం తర్వాత వచ్చే మొదటి పెళ్లి రోజును కూడా ఎంతో పవిత్రంగా భావించి.. పెళ్లి వేడుకలు జరుపుకుంటాం. కానీ.. ఆ మెదటి పెళ్లి రోజునే ఆ జంటకు ఏదైనా జరిగితే ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

man kills wife on first day of marriage in krishna
man kills wife on first day of marriage in krishna

జిల్లాలోని విస్సన్నపేటకు చెందిన కొర్ర దుర్గారావుకు గత సంవత్సరం లక్ష్మీ అనే యువతితో పెళ్లి జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకున్నా.. పెళ్లి తర్వాత వాళ్ల మధ్య చాలా గొడవలు వచ్చేవి. పెళ్లి అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది. వాళ్ల పెళ్లి అయిన గత బుధవారానికి సరిగ్గా ఏడాది అవ్వడంతో.. మొదటి పెళ్లి రోజు వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నారు.

రాత్రి ఇద్దరి మధ్యా గొడవ రావడంతో..

మొదటి పెళ్లి రోజు కదా.. ఇద్దరు భార్యాభర్తలు కాస్త చనువుగా ఉన్నారు. అయితే.. రాత్రి పడక విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. మరోసారి ఇద్దరూ కాసేపు పోట్లాడుకున్నారు. అయితే.. వాళ్ల గొడవ ఆరోజు ఎక్కువైంది. రోజూ లాగే.. వీళ్లు గొడవ పడుతున్నారు కాబోలు అని స్థానికులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ.. వాళ్ల గొడవ పెరిగి పెద్దదయింది. దీంతో వెంటనే ఆవేశంతో.. దుర్గారావు.. లక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. దీంతో.. తను అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే తేరుకున్న దుర్గారావు.. ఏమైందని తనను లేపి చూడగా.. అప్పటికే విగత జీవిగా పడి ఉంది. వెంటనే భయపడిపోయిన దుర్గారావు.. విస్సన్నపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి.. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే.. రంగంలోకి దిగిన పోలీసులు.. లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి.. దుర్గారావును అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి==> దారుణం… భ‌ర్త ఆ పార్ట్‌ను కోసి పెనంపై కూర వండిన భార్య…!

ఇది కూడా చ‌ద‌వండి==> రష్మి గౌతమ్- సుధీర్ ల రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కి షేకవుతున్న యూట్యూబ్

ఇది కూడా చ‌ద‌వండి==> వైర‌ల్ వీడియో.. 28 మంది భార్య‌ల సాక్షిగా 37వ పెళ్లి చేసుకున్న వృద్ద వ‌రుడు..!

ఇది కూడా చ‌ద‌వండి==> ఈ మూడు జ‌న్మ‌లలో ఎది ఉత్త‌మ‌మైన జ‌న్మో మీకు తెలుసా..?

Advertisement