SBI : ఇంట్లో కూర్చొని నెలకు రూ.90 వేల వరకు సంపాదించే చాన్స్.. బంపర్ ఆఫర్ ఇస్తున్న ఎస్బీఐ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI : ఇంట్లో కూర్చొని నెలకు రూ.90 వేల వరకు సంపాదించే చాన్స్.. బంపర్ ఆఫర్ ఇస్తున్న ఎస్బీఐ

 Authored By mallesh | The Telugu News | Updated on :26 March 2022,6:00 pm

SBI : ఎస్బీఐ బంపర్ ఆఫర్ అందిస్తోంది. దీని ఉపయోగించుకుని నెలకు సుమారు రూ.80 నుంచి రూ.90 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇది చాలా సురక్షితమైన వ్యాపారం. ఇందులో ఎలాంటి మోసం ఉండదు. ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంచైజీని తీసుకోవడం వల్ల ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు. వాస్తవానికి ఏ బ్యాంక్ కూడా తన తరపున ఏటీఎం ఇన్ స్టార్ చేయదు. వాటి కోసం స్పెషల్ సంస్థలు ఉంటాయి. ప్రతి చోటా సదరు బ్యాంక్ తన ఏటీఎంను ఇన్‌స్టాల్ చేసే కాంట్రాక్టును ఒక ప్రత్యేక సంస్థకు ఇస్తుంది. ఇలా ఏటీఎం ఫ్రాంచైజీ మీరు కూడా తీసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించ కోవచ్చు.

ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంచైజీని తీసుకునేందుకు ముందుగా 50 నుంచి 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇతర ఏటీఎంల నుంచి ఇది సుమారు 100 మీటర్ల దూరంలో ఉండాలి. ఏటీఎం ఏర్పాటు చేసే స్థలం మెయిన్ సెంటర్‌లో ఉండాలి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండాలి. సదరు ఏటీఎం రోజులు దాదాపుగా 300 లావాదేవీల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఏటీఎం ఏర్పాటు చేసే స్థలంలో పైకప్పు కాంక్రీట్ తో ఏర్పాటు చేసి ఉండాలి. దీనికి తోడు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజింగ్‌ను అందించే కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

make money by setting up an sbi franchise atm

make money by setting up an sbi franchise atm

SBI : ఇవి తప్పనిసరి..

ఈ కంపెనీలలో టాటా ఇండిక్యాష్ అతిపెద్ద కంపెనీ. ఇది 2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌పై ఫ్రాంఛైజీను అందిస్తుంది. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తుంది. దీనితో పాటు వర్కింగ్ క్యాపిటల్‌ గా రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలి. ప్రతి నగదు లావాదేవీపై రూ.8, నగదురహిత లావాదేవీపై రూ.2 లభిస్తాయి. ఉదాహరణకు మీ ఏటీఎం ద్వారా ప్రతిరోజూ 250 లావాదేవీలు జరిగాయనుకోండి.. అందులో 65 శాతం నగదు లావాదేవీలు, 35 శాతం నగదు రహిత లావాదేవీలు ఉంటే మీకే నెలకు దాదాపు రూ.45 వేల వరకు వస్తుంది. 500 లావాదేవీలు అయితే సుమారు రూ.80 నుంచి రూ.90 వేల వరకు సంపాదించుకోవచ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది