Revanth Reddy : మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాస్త దూకుడు మీదనే ఉన్నారు. టీపీసీసీ పీఠం ఎప్పుడు దక్కుతుందో తెలియనప్పటికీ.. తనదైన శైలితో అధికార పక్షంపై దూకుడు పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక ఫైర్ బ్రాండ్ అంటే రేవంత్ రెడ్డి మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో ఆమాత్రం అయినా కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడుతోందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో ఉన్న ఫాలోయింగే వేరు. అందుకే రేవంత్ కే టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ లోని కొందరు నేతలు అధిష్ఠానానికి సూచించారట. సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తర్వాత తెలుస్తుంది.
తాజాగా.. నిజామాబాద్ జిల్లా లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులను ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. రైతుల చావులకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలే కారణమన్నారు. వాళ్ల పనికిమాలిన విధానాల వల్లనే రైతులు చనిపోతున్నారని వాపోయారు. దొందు దొందే.. రెండూ తోడు దొంగలు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే.. రైతులు ఊరుకుంటారా? ఢిల్లీ వరకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిచారు. అలాగే.. నిజామాబాద్ పసుపు రైతులు కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్రం మెడలు వంచాలి. అప్పుడే కేంద్రానికి బుద్ధి వస్తుంది. కేసీఆర్.. రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తారట. బిడ్డా కేసీఆర్.. నువ్వు గనుక ఆపని చేసినవో.. రైతులంతా కలిసి నీ దుకాణం ఎత్తేస్తరు. రైతులు బతికుండగా సాయం చేయవు కానీ.. వాళ్లు మరణించాక.. ఆరు లక్షలు ఇస్తవా? నిజామాబాద్ నుంచి నీ బిడ్డను పంపించేస్తే హైదరాబాద్ వచ్చి పడింది. నీ బిడ్డను పంపినట్టే.. నిన్ను కూడా పంపించేస్తే నువ్వు కూడా అన్నీ సర్దుకోవాల్సిందే.. అంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.