TRS : సాగర్ ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ కు మరో షాక్? ఇలా అయితే సాగర్ లోనూ గెలవడం కష్టమే?
TRS త్వరలో తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలన్నీ చకచకా మారిపోతున్నాయి. రాత్రికి రాత్రే పరిణామాలు మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. మరోవైపు నాగార్జున సాగర్ ఉపఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ.. ఎలాగైనా సాగర్ ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. అలాగే బీజేపీ కూడా అంతే. ఇప్పటికే దుబ్బాకలో గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బాగానే సీట్లు సంపాదించింది. ఇక.. సాగర్ ఉపఎన్నికల్లో కూడా గెలిచి తమ సత్తాను చాటాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు మీదుంది. నాగార్జున సాగర్ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. అందుకే.. 2018 లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినా.. ఈసారి మాత్రం ఖచ్చితంగా మరోసారి తమ సత్తా చూపించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.
బీజేపీ వైపు చూస్తున్న తేరా చిన్నపరెడ్డి : TRS
ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతగా ఉన్న తేరా చిన్నపరెడ్డి.. ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారట. తేరా చిన్నపరెడ్డి.. సాగర్ నుంచి జానారెడ్డి చేతిలో ఓ సారి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అసలే.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. నాగార్జునసాగర్ లో ఎలాగైనా గెలవాలన్న కసితో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈసమయంలో తేరా చిన్నపరెడ్డి.. బీజేపీకి వెళ్తే.. ఇంకేమన్నా ఉందా? సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిచే చాన్సెస్ ఇంకా తగ్గుతాయి. ఒకవేళ సాగర్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కోవాల్సిందే.