Revanth Reddy : నీ బిడ్డను నిజామాబాద్ నుంచి సాగనంపాం? నిన్ను తెలంగాణ నుంచే? రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : నీ బిడ్డను నిజామాబాద్ నుంచి సాగనంపాం? నిన్ను తెలంగాణ నుంచే? రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 January 2021,8:11 pm

Revanth Reddy :  మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాస్త దూకుడు మీదనే ఉన్నారు. టీపీసీసీ పీఠం ఎప్పుడు దక్కుతుందో తెలియనప్పటికీ.. తనదైన శైలితో అధికార పక్షంపై దూకుడు పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక ఫైర్ బ్రాండ్ అంటే రేవంత్ రెడ్డి మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో ఆమాత్రం అయినా కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడుతోందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో ఉన్న ఫాలోయింగే వేరు. అందుకే రేవంత్ కే టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ లోని కొందరు నేతలు అధిష్ఠానానికి సూచించారట. సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తర్వాత తెలుస్తుంది.

malkajgiri mp shocking comments on cm kcr

malkajgiri mp shocking comments on cm kcr

తాజాగా.. నిజామాబాద్ జిల్లా లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులను ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు.

రైతుల చావుకు కారణం టీఆర్ఎస్, బీజేపీ పార్టీలే

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. రైతుల చావులకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలే కారణమన్నారు. వాళ్ల పనికిమాలిన విధానాల వల్లనే రైతులు చనిపోతున్నారని వాపోయారు. దొందు దొందే.. రెండూ తోడు దొంగలు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే.. రైతులు ఊరుకుంటారా? ఢిల్లీ వరకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిచారు. అలాగే.. నిజామాబాద్ పసుపు రైతులు కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్రం మెడలు వంచాలి. అప్పుడే కేంద్రానికి బుద్ధి వస్తుంది. కేసీఆర్.. రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తారట. బిడ్డా కేసీఆర్.. నువ్వు గనుక ఆపని చేసినవో.. రైతులంతా కలిసి నీ దుకాణం ఎత్తేస్తరు. రైతులు బతికుండగా సాయం చేయవు కానీ.. వాళ్లు మరణించాక.. ఆరు లక్షలు ఇస్తవా? నిజామాబాద్ నుంచి నీ బిడ్డను పంపించేస్తే హైదరాబాద్ వచ్చి పడింది. నీ బిడ్డను పంపినట్టే.. నిన్ను కూడా పంపించేస్తే నువ్వు కూడా అన్నీ సర్దుకోవాల్సిందే.. అంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది