మమతనే సీఎం.. కాని ఇలా చేస్తేనే..!
పశ్చిమ బెంగాల్ లో Mamata Banerjee టీఎంసీ పార్టీ అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాని ఆ విజయం తాలూకు సంతోషం ఆ పార్టీ అధినేత మమత బెనర్జీ మరియు పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు. కారణం సీఎం క్యాండిడేట్ అయిన మమత బెనర్జీ నందిగ్రామ్ లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సీఎం క్యాండిడేట్ ఓడిపోవడం తో విపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. సీఎంగా మమత బెనర్జీకి ప్రమాన స్వీకారం చేసే అర్హత లేదు అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. మరో వైపు మమత సీఎం గా ప్రమాణ స్వీకారంకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.
ఒకే ఛాన్స్..
సాదారణంగా మన రాజ్యాంగంలో ప్రధాని లేదా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వారు కనీసం చట్ట సభలో సభ్యులుగా లేకుంటే కనీసం ఆరు నెల్లలో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎంపిక అవ్వాల్సి ఉంటుంది. ప్రధాని అయితే రాజ్యసభ లేదా లోక్ సభల్లో ఒక దాని నుండి సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. అదే రాష్ట్రం విషయానికి వస్తే అసెంబ్లీ లేదా మండలి నుండి సభ్యత్వం ను కలిగి ఉండాల్సి ఉంటుంది. కాని పశ్చిమ బెంగాల్ లో మండలి లేదు. కనుక మమత ఎమ్మల్యేగా పోటీ చేసి గెలవాల్సిందే.
ఉప ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో..
పశ్చిమ బెంగాల్ లో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించలేదు. కనుక అక్కడ నుండి మమత పోటీ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అక్కడ ఒక వేళ ఎన్నికలు పెట్టి మమత గెలిస్తే పర్వాలేదు లేదంటే ఆమె ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని పదవి కాలం తీరక ముందే అంటే అయిదు నెలలకు రాజీనామా చేసి మళ్లీ కొత్తగా సీఎంగా పదవి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే నైతికత లేదని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల్లో ఆమె పోటీ చేసి గెలవాల్సిందే అంటున్నారు.