KCR : మోడీ వ్యతిరేక ముఖ్యమంత్రులు అంతా కేసీఆర్ కి ఫోన్ చేశారట
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్లో లోటు పాట్లు మరియు రాష్ట్రాలకు వాళ్ళు చేస్తున్న అన్యాయం ఇంకా బడ్జెట్ లో ఉన్న లొసుగులు ఇతర విషయాలపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీతో ఢీ కొట్టడం వల్ల ఏకంగా జాతీయ మీడియాలో కేసీఆర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు కేసీఆర్ వైపు చూస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో ఒక టీవీ చానల్ కథనం ప్రసారం చేసిన కథనం ప్రకారం ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు మరియు పార్టీ అధినేతలు సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారని.. వారంతా కూడా కేసీఆర్ ని మూడో ఫ్రంట్ కు నాయకత్వం వహించాలని కోరినట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని దేవగౌడ మొదలుకొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా వరకు పలువురు కేసీఆర్ కి కాల్ చేసి మరి అభినందించారని.. వారందరి మద్దతు ఈ విషయంలో కేసీఆర్ కు ఉంటుదని హామీ ఇచ్చారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వద్ద నుండి కూడా ఫోన్ వచ్చిందని.. ఆయన కలవాలని అన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. సదరు చానల్ కేసీఆర్ కి మరియు ఆయన సన్నిహితులకు సంబంధించినది కావడం వల్ల ఇలాంటి కథనాలు వచ్చాయి.
అంతే తప్ప కేసీఆర్ కు మరియు టీఆర్‌ఎస్ పార్టీకి అంత సీన్ లేదంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు అంత సీన్ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మోడీ వ్యతిరేక కూటమి కి కేసీఆర్ కీలక పాత్ర వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది చర్చ జరుగుతుంది. కాని అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఇటీవల రాహుల్ గాంధీకి మద్దతుగా ఒక విషయమై మాట్లాడడం జరిగింది. దాంతో కాంగ్రెస్ కూడా కేసీఆర్ కి దగ్గర అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజకీయ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.