Hyderabad : లాక్ డౌన్ టైమ్ లో బయటికి.. పోలీసులు ఆపి అడిగితే..ఆయన చెప్పింది విని నోరెళ్లబెట్టిన పోలీసులు?
Hyderabad : ప్రస్తుతం తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కరోనా వల్ల ప్రజలంతా అతలాకుతలం అవుతున్నారు. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఉదయం 10 నుంచి తెల్లవారుజామున ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. మే 12 నుంచి లాక్ డౌన్ ప్రారంభం అయింది. తొలుత మే 22 వరకే లాక్ డౌన్ ను ప్రకటించింది ప్రభుత్వం. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించింది. కేవలం నిత్యావసర సరుకుల కోసం, ఇతర పనుల కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ సమయంలోనే బయటికి రావాల్సి ఉంటుంది. మిగితా సమయంలో బయటికి వస్తే పోలీసులు కేసులు నమోదు చేసి.. రోడ్ల మీదికి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. సరైన కారణం ఉంటేనే, అత్యవసరం అయితేనే, ఈపాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు.
అయితే.. తాజాగా హైదరాబాద్ లో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. లాక్ డౌన్ సమయంలో కారు వేసుకొని ఓ వ్యక్తి బయటికి వచ్చాడు. దీంతో పోలీసులు అతడి కారును ఆపి ఎక్కడికి వెళ్తున్నావు.. అంటూ ప్రశ్నించారు. దీంతో ఆయన చెప్పిన సమాధానం విన్న పోలీసులు అవాక్కయ్యారు. వార్నీ.. ఓవైపు కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలుతుంటే నువ్వు ఈ పని కోసం బయటికి వచ్చావా? అంటూ మండిపడ్డారు. ఇంతకీ ఆయన ఎందుకు బయటికి వచ్చాడో తెలుసా?
Hyderabad : తన పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగాలేదని.. బయటికి వచ్చాడట
తన పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగా లేదట. గత వారం రోజుల నుంచి ఆ కుక్క ఏం తినడం లేదట. దీంతో ఆయన దిగులు పెట్టుకున్నాడట. లాక్ డౌన్ అయినా పర్లేదు. ఏదైతే అదయిందని.. తన పెంపుడు కుక్కను తీసుకొని.. కారులో ఆసుపత్రికి బయలుదేరాడు ఆ వ్యక్తి. మధ్యలో కారును పోలీసులు ఆపడంతో ఆయన చెప్పిన ఈ సమాధానం విని పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసి కూడా ఇలా బయటికి రావడం ఏంటి? కుక్క కాదు.. బయట తిరిగితే ముందు మీరు పోతారు జాగ్రత్త.. అని వార్నింగ్ ఇచ్చి.. అతగాడిని తిరిగి ఇంటికి పంపించేశారట పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో చోటు చేసుకుంది.