Whatsapp : వాట్సప్ లో వచ్చిన మెసేజ్ ఫార్వార్డ్ చేశాడు.. ప్రాణాలు కోల్పోయాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Whatsapp : వాట్సప్ లో వచ్చిన మెసేజ్ ఫార్వార్డ్ చేశాడు.. ప్రాణాలు కోల్పోయాడు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 May 2021,12:00 pm

Whatsapp : అసలే కరోనా కాలం. చాలామంది జనాలు కరోనా సోకి చనిపోవడం లేదు.. కరోనా వస్తుందన్న భయంతో.. కరోనా సోకగానే ఇక చనిపోతామన్న భయంతో.. మీడియాలో చూపించే కథనాలతో, సోషల్ మీడియాలో వచ్చే షేర్ అయ్యే తప్పుడు కథనాలకు భయపడి చనిపోతున్నారు. లేటెస్ట్ రిపోర్డుల ప్రకారం.. కరోనాను జయించాలంటే కావాల్సింది ధైర్యం అని డాక్టర్లే చెబుతున్నారు. భయపడితే చావే.. బయట కూడా ఎక్కడ చూసినా కరోనా గురించి తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో జనాలు చాలా భయపడుతున్నారు. అందుకే.. కరోనా సోకి చనిపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

man lost his life after sharing whatsapp forward message

man lost his life after sharing whatsapp forward message

సోషల్ మీడియాలో కూడా కరోనా గురించి వాస్తవాల కన్నా అన్నీ తప్పుడు ప్రచారాలే హల్ చల్ చేస్తున్నాయి. వాటిని చదివి జనాలు ఇంకా భయం పెంచుకుంటున్నారు. అయితే.. ఇటీవల వాట్సప్ లో ఓ వ్యక్తి తనకు వచ్చిన ఓ మెసేజ్ ను ఇతరులకు ఫార్వార్డ్ చేసి తన ప్రాణాల మీదికే తెచ్చుకున్నాడు. తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్నది.

Whatsapp : కోళ్లకు కూడా కరోనా సోకిందనే మెసేజ్ ను ఫార్వర్డ్ చేసి

శ్రీనివాస్ అనే వ్యక్తి వాట్సప్ కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. అది ఏంటంటే.. కరోనా మనుషులకే కాదు.. కోళ్లకు కూడా సోకుతోంది. ఇదిగో ఓ చోట కోళ్లకు కరోనా సోకింది.. అది ఆ మెసేజ్ సారాంశం. వామ్మో… కోళ్లకు కూడా కరోనా సోకుతోందట… అంటూ ఆ వ్యక్తి వెంటనే తన ఫ్రెండ్స్ కు, ఇతరులకు… తన కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ ఆ మెసేజ్ ను వాట్సప్ లో వెంటనే ఫార్వార్డ్ చేశాడు. నిజానికి.. అది ఫేక్ న్యూస్. అది అసలు నిజమా? అబద్ధమా? అనే విషయాన్ని ఆ వ్యక్తి తెలుసుకోలేదు. నిజమే అనుకున్నాడు.. అందరికీ పంపించాడు. అయితే.. శ్రీనివాస్ ఇతరులకు ఫార్వార్డ్ చేసిన దాంట్లో ఎవరో ఆయనపై ఫిర్యాదు చేశారు. అది ఫేక్ న్యూస్ అని.. ఫేక్ న్యూస్ ను ఫార్వార్డ్ చేశాడంటూ ఆయనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు.. వెంటనే శ్రీనివాస్ కు ఫోన్ చేసి ఆ మెసేజ్ ఎందుకు ఫార్వార్డ్ చేశావంటూ ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నావంటూ నిలదీశారు. దీంతో తనకేమీ తెలియదని.. ఎవరో పంపిస్తే.. తాను కూడా అందరికీ పంపించానని.. దాని గురించి తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో పోలీసులు కూడా అది ఫార్వార్డ్ మెసేజ్ కదా అని ఊరుకున్నారు.

కానీ.. తనకు పోలీసులు ఫోన్ చేసి ప్రశ్నించడంతో.. శ్రీనివాస్ కు టెన్షన్ పెరిగిపోయింది. వెంటనే ఆయన ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో తన కుటుంబ సభ్యులు శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే… మృతి చెందాడు. తన భర్తను పోలీసులు మానసికంగా వేధించారని.. అందుకే తన భర్త చనిపోయాడంటూ.. శ్రీనివాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. చూశారా? వాట్సప్ లో ఫార్వార్డ్ చేసిన ఒక్క మెసేజ్.. ఎలా ఓ వ్యక్తి ప్రాణం తీసిందో. అందుకే.. సోషల్ మీడియాలో కానీ.. వాట్సప్ లో కానీ వచ్చే మెసేజ్ లు అన్నీ నిజమా? అబద్ధమా? అని తెలుసుకోకుండా… ఎవ్వరికి పడితే వారికి ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడకండి.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది