Health Tips : ఒక్క ఆకు తింటే చాలు.. గుండె, బ్రెయిన్ పదిలంగా ఉన్నట్లే
Health Tips : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అయినా కొంతమంది ఆకుకూరలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ ఆకు కూరలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆకుకూరలన్నింటిలో బచ్చల కూర చవకైనది. ఏడాది పొడుగునా దొరుకుతుంది. ఎరువులు, పురుగుల మందులు ఈ ఆకుకూరలకి కొట్టరు. ఎందుకంటే ఎలాంటి దోషం లేకుండా ఫ్రీగా పెరిగిపోతుంది. బచ్చల కూరలో మన గుండెకు మెదడుకు లాభాన్ని కలిగించేవి చాలా ఉన్నాయి. ఈ రెండు డామేజ్ అవ్వటానికి నిర్మూలించడానికి బచ్చల కూర ఉపయోగపడుతుంది.
100 గ్రాముల బచ్చల కూర తీసుకుంటే 128 మైక్రోగ్రాముల పోలిక్ యాసిడ్స్ మన శరీరానికి అందుతాయి. శరీరంలో హోమోసిస్టిన్ అనేది విడుదల అవుతుంది. ఈ హోమోసిస్టిన్ ఎక్కువగా రిలీజ్ అవడం వలన గుండె సమస్యలు, బ్రెయిన్ డెఫిషియన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే బచ్చల కూర హోమోసిస్టిన్ విడుదల కాకుండా నిర్మూలించి బ్రెయిన్ ని, హార్ట్ ను రక్షిస్తాయి. ఈ రెండు ప్రధాన సమస్యలకు బచ్చల కూర బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బచ్చలి కూర తినడానికి ఇష్టపడాలి.
అలాగే కూరలలో ఎక్కువ మసాలాలు, నూనెలు పడతాయి. అదే ఆకుకూరలలో అయితే తక్కువగా, త్వరగా అయిపోతాయి. తిన్న తర్వాత త్వరగా కూడా జీర్ణం అవుతాయి. బచ్చల కూర పప్పులో వేసుకొని వండుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. పొద బచ్చలు అయినా తీగ బచ్చలు అయినా ఆరోగ్యానికి మంచివి. వాటి కాడలు కూడా చాలా మంచివి. బచ్చల కూర వారానికి ఒకటి రెండు సార్లు తినడానికైనా ప్రయత్నించాలి. వీటిని తినడం వలన మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.