Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్ ను తీసుకుంటారు. కానీ వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు అనే తేడా లేకుండా అందరూ లొట్టలేసుకుంటూ తినే పదార్థం పనీర్. అవును.. పనీర్ తో చేసే వంటకాలు అంటే మామూలుగా ఉండవు. అలాగే ఎగ్ కూడా చాలామంది ఇష్టంగా తింటారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఎగ్, పనీర్ ఈ రెండు అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాలే. అందుకే.. ఎగ్ లేదా పనీర్ ఈ రెండు ఫుడ్స్ లో ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలో చాలామందికి తెలియదు.
#image_title
అయితే… ఉడకబెట్టిన గుడ్డులో ప్రొటీన్ తో పాటు ఫ్యాట్, కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ ఉంటారు. ఒక గుడ్డులో 44 గ్రాములు ఉంటాయి. అందులో 5.5 గ్రాముల ప్రొటీన్, 4 గ్రాముల ఫ్యాట్, 24 మిల్లీ గ్రాముల కాల్షియం, 60 గ్రాముల పొటాషియం ఉంటుంది.
అదే ఇంచుమించు 44 గ్రాములు ఉండే పనీర్ ను తీసుకుంటే 7.5 గ్రాముల ప్రొటీన్, 6 గ్రాముల ఫ్యాట్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 200 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.
రెండింటినీ కంపేర్ చేస్తే గుడ్డులో కంటే పనీర్ లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే నాన్ వెజ్ తినని వాళ్లు ప్రొటీన్ కోసం పనీర్ ను ఎక్కువగా తీసుకోవచ్చు. కాకపోతే మంచి పనీర్ ను, పాలతో చేసిన పనీర్ ను మాత్రమే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.